Site icon Prime9

Electric Scooter: మార్కెట్లో త్వరలో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్

simple-one-electric-scooter-launch-in-march-2023

simple-one-electric-scooter-launch-in-march-2023

Electric Scooter: మార్కెట్లోకి మరో సరికొత్త ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనం అందుబాటులోకి రానుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను వచ్చే మార్చిలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ కంపెనీ తన సింపుల్ వన్ స్కూటర్ ను గతంలోనే ఆవిష్కరించిన సంగతి తెలిసిందే కాగా వాటికి గానూ బుకింగ్ లు తీసుకుంటోంది. ఇంకా వీటికి సంబంధించి తయారీ ఇంకా ప్రారంభం కాలేదు.

తమిళనాడులోని షూలగిరి వద్ద రూ.100 కోట్ల పెట్టుబడితో సింపుల్ వన్ ఓ అతిపెద్ద ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఏటా 10 లక్షల వాహనాలను తయారు చేసే సామర్థ్యం ఉంది. ఇక్కడ 2023 జనవరి 19 నుంచి స్కూటర్ల తయారీ మొదలు కానుంది. అనంతరం మార్చి నుంచి స్కూటర్లను డెలివరీ చేస్తుంది. కాకపోతే గతంలో రూ.1.10 లక్షల వరకు ఎక్స్ షోరూమ్ ధర ఉంటుందని పేర్కొనింది. కాగా సరఫరా సమస్యల నేపథ్యంలో ఈ ధర కొంత పెరగొచ్చన్న సంకేతాలను ఇచ్చింది. రాష్ట్రాల సబ్సిడీలు కాకుండా ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.45 లక్షలుగా ఉంది. సింపుల్ వన్ ఒక్కసారి చార్జ్ చేస్తే 236 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ గతంలో పేర్కొనగా దీన్ని అప్ డేట్ చేసినట్టు, ఒక్కసారి చార్జ్ తో 300 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని చెబుతోంది.

ఇదీ చదవండి: ఫేస్​బుక్​-ఇన్​స్టాగ్రామ్​ రీల్స్​కు పోటీగా.. జియో నుంచి కొత్త యాప్

Exit mobile version