Site icon Prime9

Instagram: ఇన్‌స్టాగ్రామ్ కు ఏమైంది.. ఒక్కసారిగా అకౌంట్లు డిలీట్..!

Instagram accounts suspended

Instagram accounts suspended

Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు వింత అనుభవం ఎదురైయ్యింది. సోమవారం నాడు చాలామంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు తమ అకౌంట్లు సరైన వార్నింగ్ లేకుండానే డిలీట్ అయ్యాయని పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా చాలా మంది యూజర్లు ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ డిసగ్రీ విత్ డెసిషన్ (Disagree with decision)’ ఆప్షన్‌పై క్లిక్ చేసినప్పటికీ తమ అకౌంట్లు తిరిగి పొందలేకపోయామని వాపోయారు.

అవుట్‌టేజ్ ట్రాకర్, డౌన్‌డెక్టర్, భారత్, ఇతర దేశాలలో అనేక మంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు లాగిన్ సమస్యలను ఎదుర్కొంటున్నామని నెట్టింట ఫిర్యాదులు చేశారు. మరికొందరైతే సర్వర్ కనెక్షన్ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయంటూ తెలిపారు. ఇక ఈ సమస్యలపై స్పందించిన మెటా సంస్థ ఇది సర్వర్ సమస్య అని వెల్లడించింది. కంపెనీ ఈ విషయాన్ని పరిశీలిస్తోందని ట్విట్టర్‌లో ఒక పోస్ట్ ద్వారా పేర్కొనింది. కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ యాక్సెస్ చేయడంలో కంపెనీకి సమస్యలు ఉన్నాయని ప్రకటించింది. ఈ అసౌకర్యానికి గాను మెటా సంస్థ యూజర్లకు క్షమాపణలు తెలిపింది. అయితే ఈ సమస్య కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మాత్రమేనని అందరికీ ఈ సమస్య లేదని చెప్పింది. ఫేస్‌బుక్, వాట్సాప్ మెసెంజర్ వంటి ఇతర మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్‌లు ఎలాంటి అవాంతరాలు లేకుండా పని చేస్తున్నాయని కూడా తెలిపింది.

ఇదిలా ఉంటే మెటా ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్, వాట్సాప్, గత వారంలో పెద్ద అంతరాయాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంత సమయానికి రూటర్లలో కాన్ఫిగరేషన్ మార్పుల కారణంగా వాట్సాప్ డౌన్ అయిందని కంపెనీ స్పష్టం చేసింది. తిరిగి ఆ సమస్యను పరిష్కరించి సేవలను పునరుద్ధరించింది.

ఇదీ చదవండి ఇకపై ట్విట్టర్ “బ్లూ టిక్”కూ డబ్బులు..!

Exit mobile version