Site icon Prime9

Virat Kohli: ఐపీఎల్ లో తొలి ఇండియన్ ప్లేయర్ గా విరాట్ కోహ్లీ రికార్డు

Virat Kohli

Virat Kohli

Virat Kohli: ఐపీఎల్ సీజన్ 16 లో రాయల్ చాలెంజర్స్ ఘనంగా బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో బెంగరూరు 8 వికెట్లతో ముంబై ఇండియన్స్ పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లి చెలరేగి ఆడాడు. 49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్ లతో 82* పరుగులతో విరుచుకుపడ్డాడు. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టపోయి 171 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ముందు ఉంచింది. అనంతరం ఛేదన కు దిగిన బెంగళూరు 16.2 ఓవర్లల 172/2 స్కోరు చేసి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.

ఓపెనర్లు గా దిగిన విరాట్ కోహ్లీ, కెఫ్టెన్ డుప్లెసిస్ లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీళ్లద్దరు కలిసి 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లి ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 49 బంతుల్లో 82 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన కోహ్లీ.. ఐపీఎల్ లో 50 కి పైగా స్కోరు (45 హాఫ్ సెంచరీలు, 5 సెంచరీలు) చేసిన మొదటి ఇండియన్ ఫ్లేయర్ గా రికార్డులో కెక్కాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ 60 అర్థ సెంచీలు సాధించాడు. ఇక పంజాబ్ కింగ్స్ కెఫ్టెన్ శిఖర్ ధావన్ 49 హాఫ్ సెంచరీలతో కొనసాగుతున్నాడు.

టాప్ 5 లో(Virat Kohli)

ఈ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటి వరకు 5 మ్యాచులు పూర్తి అయ్యాయి. ఆరెంజ్ క్యాప్ రేసులో చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (92) టాప్ ప్లేసులో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత ముంబై ప్లేయర్ తిలక్ వర్మ(84), ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(82), లక్నో ప్లేయర్ కైల్ మేయర్స్, ఆర్సీబీ ప్లేయర్ ఫాప్ డు ప్లెసిస్(73) లు ఉన్నారు.

మరో వైపు బౌలర్ల విభాగంలో పర్పుల్ క్యాప్ రేసులో లక్నో సూపర్ జెయింట్ పేసర్ మార్క్ ఉడ్(5 వికెట్లు), రాజస్థాన్ రాయల్స్ స్నిన్నర్ యుజ్వేంద్ర చాహల్( 4 వికెట్లు), పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్హదీప్ సింగ్ (3 వికెట్లు) లతో టాప్ 5 లో ఉన్నారు.

 

Exit mobile version