Site icon Prime9

Virat Kohli: ఎదుటివాళ్లకు ఇచ్చినపుడు.. నువ్వు కూడా తీసుకోవాలి.. కోహ్లి కామెంట్స్ వైరల్

virat kohli

virat kohli

Virat Kohli: ప్రస్తుతం ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య జరిగిన గొడవ గురించే చర్చ సాగుతోంది. మ్యాచ్ అనంతరం గ్రౌండ్ లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. గొడవ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ గెలుపు విషయంలో కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కోహ్లీ వ్యాఖ్యలు వైరల్.. (Virat Kohli)

ప్రస్తుతం ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య జరిగిన గొడవ గురించే చర్చ సాగుతోంది. మ్యాచ్ అనంతరం గ్రౌండ్ లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది.

దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. గొడవ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఈ గెలుపు విషయంలో కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఒకవేళ నువ్వు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే.. తిరిగి తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.

అలాలేని పక్షంలో ఎదుటివాళ్లకు ఏదో ఒకటి ఇవ్వాలనే సాహసం చేయకూడదు అంటూ విరాట్‌ కోహ్లి తనను విమర్శించిన వాళ్ల నోళ్లు మూయించాడు.

లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌ గౌతం గంభీర్‌ను ఉద్దేశించి పరోక్షంగా కౌంటర్‌ ఇచ్చాడు.

ఈ మ్యాచ్‌ అనంతరం డ్రెసింగ్‌ రూంలో సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ తమ అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది.

ఈ మ్యాచ్ లో మా జట్టు విజయం సాధించడం చాలా ముఖ్యమైన విషయం అని కోహ్లీ అన్నాడు. లక్నో ప్రేక్షకుల నుంచి కూడా ఎక్కువ మద్దతు లభించినట్లు తెలిపాడు.

స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో తమ జట్టు పూర్తిగా విజయం సాధించిందని అన్నాడు.

గొడవకు కారణం ఇదే..

భారత్‌ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ అత్యుత్తమ ఆటగాళ్లుగా మంచి పేరు పొందారు. అయితే వీరిద్దరికి మధ్య మనస్పర్ధలు ఉన్న మాట వాస్తవమే.

అయితే నిన్నటితో ఈ వ్యవహారం ఇంకాస్త ముదిరింది. సోమవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

లక్నో జట్టును బెంగళూరు జట్టు 18 పరుగుల తేడాతో ఓడించింది.

గత మ్యాచ్‌లో లక్నో విజయం తరువాత గంభీర్ మైదానంలోకి వచ్చి అభిమానుల వైపు చూస్తూ నోటికి వేలు అడ్డుపెట్టి సంజ్ఞ చేశాడు.

మ్యాచ్ సందర్భంగా కృనాల్ పాండ్యా క్యాచ్ అందుకున్న కోహ్లీ గంభీర్‌లా చేయకూడదని సూచిస్తూ ముద్దు పెడుతున్నట్లు సంజ్ఞ చేశాడు.

ఈ విషయంలో మ్యాచ్ అనంతరం గంభీర్, కోహ్లీ మధ్య వాగ్వివాదానికి కారణమైనట్లు తెలుస్తోంది.

మ్యాచ్‌ అనంతరం ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి.

ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీయడంతో సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకొని విడదీసారు.

అమిత్ మిశ్రా కోహ్లీని అడ్డుకోగా.. కేఎల్ రాహుల్ గంభీర్‌ను పక్కకు తీసుకెళ్లాడు.

వీరి గొడవకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇప్పుడే కాదు.. ఐపీ‌ఎల్ 2013 సీజన్‌లోనూ కోహ్లీ, గంభీర్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అప్పడు గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా ఉన్నాడు.

అయితే, ఈసారి లక్నో జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు. బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్ గా కోహ్లీ ఉన్నాడు.

మ్యాచ్ ముగిసిన అనంతరం ఆటగాళ్లంతా ఒకరినొకరు కరచాలనం చేసుకున్నారు. ఈ క్రమంలో గంభీర్, కోహ్లీ మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

ఒకరిపైకి ఒకరు దూసుకెళ్తూ కొట్టుకొనేంత పనిచేశారు. వీరి మధ్య వాగ్వివాదం తీవ్రరూపం దాల్చే క్రమంలో ఇరుజట్ల సభ్యులు వారిని పక్కకు తీసుకెళ్లారు.

దీంతో మ్యాచ్ అనంతరం మైదానంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పుడే కాదు.. ఐపీ‌ఎల్ 2013 సీజన్‌లోనూ కోహ్లీ, గంభీర్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది.

అప్పడు గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా ఉన్నాడు. అయితే, ఈసారి లక్నో జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు.

Exit mobile version