Tollywood Cricket: దేశంలో ఎక్కువ మంది ఇష్టపడేవి రెండే రెండు.. అందులో ఒకటి సినిమా అయితే.. మరొకటి క్రికెట్. మన దేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. టీమిండియా దేశంలో ఎంత క్రేజ్ ఉందో.. సినీ వర్గాల్లో ఆడే మ్యాచులకు కూడా అంతే ఆదరణ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఆ పండగా రాబోతుంది. టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దేశంలో చాపకింద నీరులా పెరుగుతున్న డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 26న ఈ మ్యాచ్ ఎల్బీ స్టేడియం వేదికగా జరుగనుంది.
దీనికి సంబంధించిన వేడుక హైదరాబాద్ లో జరిగింది.
పోటీలను ప్రతి సంవత్సరం.. హైదరాబాద్ లో నిర్వహిస్తుంటారు.
ఈ ఏడాది కూడా క్రెసెంట్ క్రికెట్ (Cricket ) కప్ పేరుతో ఫిబ్రవరి 26న నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ ఏడాది సే నో టు డ్రగ్స్ అనే అంశంపై అవగాహన కల్పిస్తామని వారు తెలిపారు.
బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి హోంమంత్రి మహమూద్ అలీ.. మంత్రి తలసాని క్రికెట్ కప్, పోటీల బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ పూర్తిగా ఉచితంగా వీక్షించవచ్చని ఆసక్తి గల వారు సీసీసీ వెబ్‌సైట్‌లో తమ పేర్లను ముందుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. అనంతరం దానికి సంబంధించిన పాస్ లను పొందవచ్చని తెలిపారు.
పాస్ లు ఉన్నవారికి మాత్రమే గ్రౌండ్ లోకి అనుమతి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాలీవుడ్ టీమ్ కెప్టెన్ అర్బాజ్ ఖాన్ పాల్గొన్నారు.
అలాగే బిగ్ బాస్ 6 విజేత రేవంత్, తెలుగు నటులు రాజ్ తరుణ్, వరణ్ సందేశ్ ఇతరులు పాల్గొన్నారు.
ఈ క్రికెట్ పోటీల్లో టాలీవుడ్ యువ హీరోలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
సీసీసీ టీమ్ సభ్యులను హోంమంత్రి అభినందించారు.
డగ్ర్స్ నిర్మూలనే ధ్యేయంగా ఈ క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నారు.
మ్యాచ్ కోసం పూర్తి ఏర్పాట్లను చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
డ్రగ్స్ ను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చిన నటులు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/