SRH vs KKR: ఉత్కంఠ పోరులో కోల్ కతా విజయం సాధించింది. గెలిచే మ్యాచ్ ను సైతం సన్ రైజర్స్ చేజార్చుకుంది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన స్థితిలో కూడా సన్ రైజర్స్ ఓటమిపాలైంది.
గెలిచే మ్యాచ్ లో ఓటమి.. (SRH vs KKR)
ఉత్కంఠ పోరులో కోల్ కతా విజయం సాధించింది. గెలిచే మ్యాచ్ ను సైతం సన్ రైజర్స్ చేజార్చుకుంది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన స్థితిలో కూడా సన్ రైజర్స్ ఓటమిపాలైంది. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం.. క్రీజులో అబ్దుల్ సమద్ తో పాటు మరో మూడు వికెట్లు ఉన్నాయి. అందరూ సన్ రైజర్స్ దే గెలుపు అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఓవర్ పూర్తయ్యేసరికి ఐదు పరుగుల తేడాతో కోల్ కతా విజయం. ఆఖరి ఓవర్ ను అద్భుతంగా బౌలింగ్ చేసి.. వరుణ్ చక్రవర్తి కోల్ కతా కు విజయాన్ని అందించారు.
కోల్ కతా ప్రతీకారం..
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్ కతా ను సన్ రైజర్స్ ఓడించిన విషయం తెలిసిందే.
ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి కోల్ కతా ప్రతీకారం తీర్చుకుంది.
మ్యాచ్ లో పూర్తి పట్టు సాధించిన చివరి వరకు కొనసాగించలేకపోయింది.
దీంతో ఐదు పరుగుల తేడాతో కోల్ కతా విజయం సాధించింది. మెుదట కోల్ కతా 9 వికెట్లకు 171 పరుగులు సాధించింది.
రింకు సింగ్ (46; 35 బంతుల్లో 4×4, 1×6), నితీశ్ రాణా (42; 31 బంతుల్లో 3×4, 3×6) రాణించారు. మార్కో జాన్సన్ (2/24), నటరాజన్ (2/30) ఆ జట్టును కట్టడి చేశారు.
అనంతరం సన్‌రైజర్స్ 8 వికెట్లకు 166 పరుగులే చేయగలిగింది.
కెప్టెన్ మార్‌క్రమ్ (41; 40 బంతులో 4×4), క్లాసెన్ (36; 20 బంతుల్లో 1×4, 3×6), అబ్దుల్ సమద్ (21; 18 బంతుల్లో 3×4) పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు.
కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా (2/32), శార్దూల్ ఠాకూర్ (2/23), వరుణ్ చక్రవర్తి (1/20) మెరిశారు. ఈ గెలుపుతో కోల్‌కతా తన ప్లేఆఫ్స్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది.
నిరాశ పరిచిన హారీ బ్రూక్..
హారీ బ్రూక్ మరోసారి నిరాశ పరిచాడు. ఈ మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. మెుదట్లో మయాంక్ అగర్వాల్ మెరిసిన.. మిగతా బ్యాట్స్ మెన్ పెద్దగా రాణించలేదు.
చివర్లో 18 బంతుల్లో 26 పరుగులు కావాలి. సమద్ పోరాడిన ఫలితం లేకుండా పోయింది.
చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. స్పిన్నర్ వరుణ్ బంతిని అందుకోవడం ఆశ్చర్యపరిచింది.
తొలి 2 బంతులకు సింగిల్స్ వచ్చాయి. మూడో బంతికి సమద్ భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ దగ్గర అనుకుల్‌కు దొరికిపోయాడు.
3 బంతుల్లో 7 పరుగులు.. ఒకే పరుగు రావడంతో సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు.