Shubman Gill: టీమ్ఇండియా సంచలన బ్యాటర్ శుభ్ మన్ గిల్ కు ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. గత రెండు సిరీస్ ల నుంచి సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ పరుగుల వరద పారిస్తున్న గిల్ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్’(జనవరి 2023) గా ఎంపికయ్యాడు. గత నెలలో జరిగిన శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్ ల్లో గిల్ దుమ్మురేపాడు.
ఈ రెండు సిరీస్ ల్లో కలిపి 567 పరుగులు చేశాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన న్యూజిలాండ్ తో తొలి వన్డేల్లో అధ్బుతంగా రాణించిన గిల్ .. తర్వాత టీ 20 ల్లోనూ సెంచరీ సాధించాడు.
అదేవిధంగా శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లోనూ గిల్ మరో సెంచరీ సాధించాడు. కాగా, ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం గిల్ ..
టీంఇండియా మరో స్టార్ మహ్మద్ సిరాజ్, కివీస్ బ్యాటర్ డెవాన్ కాన్వేలను వెనక్కి నెట్టాడు.
అందరికీ రుణపడి ఉంటా: గిల్(Shubman Gill)
ఈ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకోవడం కోసం సహకరించిన ఐసీసీ ప్యానెల్ , క్రికెట్ అభిమానులకు ధన్యవాదాలు చెప్పాడు శుభ్ మన్ గిల్.
జనవరి తనకు ప్రత్యేకమైన నెల అని.. ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుతో మరింత స్పెషల్ గా మారిందన్నాడు.
ఈ విజయానికి కారణమైన టీమ్ సభ్యులకు, కోచ్ లకు రుణపడి ఉంటాను అని గిల్ తెలిపాడు. వన్డే వరల్డ్ కప్ రానున్న నేపథ్యంలో ఈ స్పెషల్ ఇన్నింగ్స్ మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపాయన్నాడు.
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ మహిళా బ్యాటర్
మరో వైపు జనవరి నెలకు మహిళల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఇంగ్లండ్ యంగ్ క్రికెటర్ గ్రేస్ స్క్రీవెన్స్ దక్కించుకుంది.
ఈ ఏడాది జరిగిన అండర్ 19 ప్రపంచకప్ లో ఆమె అద్భుతంగా రాణించినందుకుగాను ఈ అవార్డు లభించింది. అదేవిధంగా ఐసీపీ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న అతి చిన్న వయసు క్రికెటర్ గా ఆమె చరిత్ర సృష్టించింది.