Site icon Prime9

GT vs CSK: నేడు తొలి క్వాలిఫయర్.. శుభ్ మన్ గిల్ కీలక వ్యాఖ్యలు

shubman gill

shubman gill

GT vs CSK: ఐపీఎల్ లో లీగ్ స్టేజ్ ముగిసింది. ఇక మరో అంకానికి నేడు తెర పడనుంది. గుజరాత్ టైటాన్స్ తో, చెన్నై సూపర్ కింగ్స్ తొలి క్వాలిఫయర్ లో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు.. నేరుగా ఫైనల్ కి చేరుతుంది. ఈ మ్యాచ్ కు ముందు.. ధోని సేనకు గిల్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

నేడే తొలి క్వాలిఫయర్..

ఐపీఎల్ లో లీగ్ స్టేజ్ ముగిసింది. ఇక మరో అంకానికి నేడు తెర పడనుంది. గుజరాత్ టైటాన్స్ తో, చెన్నై సూపర్ కింగ్స్ తొలి క్వాలిఫయర్ లో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు.. నేరుగా ఫైనల్ కి చేరుతుంది. ఈ మ్యాచ్ కు ముందు.. ధోని సేనకు గిల్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

నేడు గెలిచిన జట్టు.. నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఇక ఈ రెండు జట్ల మధ్య ఉత్కంఠ పోరు సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

గిల్ కీలక వ్యాఖ్యలు..

తొలి క్వాలిఫయర్ మ్యాచ్ సందర్భంగా గుజరాత్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

చెపాక్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో చెన్నై ని ఎదుర్కొవడానికి.. తమ వద్ద గొప్ప బౌలింగ్ ఉందని ధోనికి గిల్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

చెన్నైలో చెన్నైపై తలపడటం కోసం తాము ఉత్సాహంగా ఉన్నామని అన్నాడు. రెండో సారి మేం ఫైనల్‌లో అడుగుపెడతామనే ధీమా వ్యక్తం చేశాడు.

ఇక తన ఆట గురించి మాట్లాడుతూ.. ‘నా ఆటేంటో నాకు తెలుసు.. ఏ ఆటగాడికైనా తనకు తాను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం’ అని వివరించాడు.

‘మంచి స్టార్ట్‌ లభించాలి. దాన్ని పెద్ద స్కోరుగా మలచాలి. గత మ్యాచ్‌లో నేను అలా చేయగలిగాను’ అని తన సెంచరీ గురించి స్పందించాడు గిల్‌.

ఈ గుజరాత్‌ ఓపెనర్‌ తాజా సీజన్‌లో అదరగొడుతున్న విషయం తెలిసిందే.

అతడు ఇప్పటికే 680 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో ఆర్సీబీ కెప్టెన్‌ డుప్లెసిస్‌(730) తర్వాతి స్థానంలో ఉన్నాడు.

ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు ఉండటంతో డుప్లెసిస్‌ను అధిగమించే అవకాశాలు గిల్‌కు ఎక్కువగా ఉన్నాయి.

Exit mobile version