Delhi Capitals: దిల్లీ వరుసగా ఐదు మ్యాచుల్లో ఓటమిపాలైంది. గెలిచే అవకాశాలు ఉన్న.. ఆ జట్టు గెలవలేకపోతుంది. దీంతో పెద్ద ఎత్తున ఆ జట్టుపై విమర్శలు వస్తున్నాయి. మరి ఆ జట్టు వైఫల్యాలకు కారణాలు ఏంటి. జట్టు సమిస్టి లోపమా?.. దీనికి ఎవరు కారణం.
వరుస వైఫల్యాలు.. (Delhi Capitals)
దిల్లీ వరుసగా ఐదు మ్యాచుల్లో ఓటమిపాలైంది. గెలిచే అవకాశాలు ఉన్న.. ఆ జట్టు గెలవలేకపోతుంది. దీంతో పెద్ద ఎత్తున ఆ జట్టుపై విమర్శలు వస్తున్నాయి. మరి ఆ జట్టు వైఫల్యాలకు కారణాలు ఏంటి. జట్టు సమిస్టి లోపమా?.. దీనికి ఎవరు కారణం. దిల్లీ జట్టులో గొప్ప ఆటగాళ్లు లేరుగాని.. డగౌట్‌లో హేమాహేమీలైన మాజీలు ఉన్నారు. పరిస్థితులను అలవోకగా అంచనా వేయడంలో వారు సమర్దులు. కానీ వారి అంచనాలు తలకిందులు అవుతున్నాయి. ఐపీఎల్‌లో దిల్లీ గత కొన్నేళ్లుగా అదరగొడుతుంది. ఈసారి మాత్రం ఉసూరుమనిపిస్తోంది. అసలు వార్నర్ సేన పరాజయాల వెనుక కారణాలేంటి?
హెడ్ కోచ్‌గా రికీ పాంటింగ్.. డైరెక్టర్‌గా గంగూలీ.. కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ లాంటి సీనియర్ ఆటగాడు ఈ జట్టు సొంతం. అయినా కూడా దిల్లీకి అదృష్టం కలిసి రావడం లేదు. గత సీజన్లలో వరుసగా ప్లేఆఫ్స్ వరకూ చేరి మంచి జట్టుగా పేరు తెచ్చుకున్న దిల్లీ.. ఈ సీజన్ లో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో ఖాతా తెరవలేదు. తొలి విజయం కోసం పోరాటం చేస్తూనే ఉంది.
వార్నర్ ఒక్కడే..
దిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడి.. ఈ సీజన్ కు దూరమయ్యాడు. అతడి స్థానంలో డేవిడ్ వార్నర్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. అందుకు తగ్గట్టే ప్రతి మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు అర్ధ శతకాలు నమోదు చేశాడు. ఇప్పటివరకూ మొత్తం 228 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు. కానీ అవతలి వైపు నుంచి వార్నర్ కు సరైన మద్దతు రావడం లేదు. మరోవైపు దిల్లీకి టాప్ ఆర్డర్ పెద్ద సమస్యగా మారింది. ప్రతి మ్యాచ్ లో టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతూ వస్తుంది. ఇక ఆల్‌రౌండర్ మార్ష్ ఇప్పటివరకూ రాణించింది లేదు.
నిరాశపరుస్తున్న పృథ్వీ..
దిల్లీ ఓపెనర్ పృథ్వీ షా తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. రెండు సార్లు డకౌట్ అయ్యాడు.
మిగతా మ్యాచ్‌ల్లో చేసిన పరుగులు 12, 7, 15 మాత్రమే. ఈ గణాంకాలు చూస్తే అతడి ప్రదర్శన ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది.
పదే పదే ఒకరకమైన షాట్లకు ప్రయత్నించి ఔట్ అవుతున్నప్పటికీ.. తప్పుల నుంచి ఏ మాత్రం నేర్చుకోవడం లేదు.
అతడితో కలిసి ఆడిన సహచర ఆటగాడు శుభ్‌మన్ గిల్ అన్ని ఫార్మాట్లలో దూసుకుపోతుంటే.. షా ఇంకా ఐపీఎల్‌లోనే ఇబ్బంది పడుతున్నాడు.
అతడి ప్రదర్శనపై పలువురు మాజీలు విమర్శలు గుప్పించారు. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాలని అతడికి సూచిస్తున్నారు.
అక్షర్ రాణిస్తున్నా..
దిల్లీలో రాణిస్తుంది అక్షర్ పటెల్ మాత్రమే. ఇటు బౌలింగ్.. బ్యాటింగ్ లో రాణిస్తున్నాడు.
ముంబయిపై అర్ద శతకాన్ని (54) నమోదు చేయగా.. గుజరాత్‌పై బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (36) ఆడాడు.
అటు బంతితోనూ రాణిస్తున్నాడు. ఇక మనీశ్ పాండే కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు.
పంత్ లేని లోటు..
గత సీజన్లలో దిల్లీ వరుసగా ప్లేఆ ఫ్స్‌కు చేరిందంటే అందులో పంత్ పాత్ర కూడా ఉంది.
మిడిల్ ఆర్డర్‌లో దూకుడుగా ఆడే పంత్.. జట్టుకు ఎన్నో విజయాలు సాధించిపెట్టాడు. ఇప్పుడు అతడి లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. అతడి స్థానాన్ని భర్తీ చేసే వారు జట్టులో కరవయ్యారు.
విఫలమవుతున్న బౌలింగ్ యూనిట్..
ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా, నోకియా, అక్షర్, ముస్తాఫిజర్, కుల్దీప్ యాదవ్ లాంటి వారితో బౌలింగ్ దళం పటిష్ఠంగానే కనిపిస్తున్నప్పటికీ.. ప్రత్యర్థి బ్యాటర్లను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారు. ధారళంగా పరుగులు సమర్పిస్తూ జట్టును కాపాడలేకపోతున్నారు.
పేసర్లకు అనుకూలంగా ఉన్న పిచ్‌లపైనా తేలిపోవడం దిల్లీ ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
లోపిస్తున్న వ్యూహాలు..
దిల్లీ ఈ సీజన్‌లో పూర్తిగా గాడి తప్పినట్లు కనిపిస్తోంది. సరైన ప్రణాళికలతో ముందుకు రావడం లేదు.
తమ ప్రణాళికలను అమలు పరచడంలో ఆ జట్టు పూర్తిగా గందరగోళానికి గురవుతోందని మాజీ కెప్టెన్ సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు.