Rohit Sharma: ఐపీఎల్ లో రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. హిట్ మ్యాన్ గా పేరొందిన రోహిత్ శర్మ వరుసగా విఫలం అవుతున్నాడు. తాజాగా చెన్నైతో జరిగిన మ్యాచులోను డకౌట్ అయ్యాడు. ఈ డకౌట్ తో ఐపీఎల్ లో ఎక్కువగా సున్న పరుగుకే ఔటయ్యిన ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు.
రోహిత్ శర్మ చెత్త రికార్డు
ఐపీఎల్ లో రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. హిట్ మ్యాన్ గా పేరొందిన రోహిత్ శర్మ వరుసగా విఫలం అవుతున్నాడు. తాజాగా చెన్నైతో జరిగిన మ్యాచులోను డకౌట్ అయ్యాడు. ఈ డకౌట్ తో ఐపీఎల్ లో ఎక్కువగా సున్న పరుగుకే ఔటయ్యిన ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో మరోసారి డకౌట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఎక్కువసార్లు జీరో పరుగుకే ఔటైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రోహిత్ ఇప్పటివరకు ఏకంగా 16 సార్లు.. సున్నా పరుగులకే ఔటయ్యాడు. రోహిత్ తర్వాత అత్యధిక సార్లు డకౌటైన ఆటగాళ్ల జాబితాలో సునీల్ నరైన్ (15), మన్‌దీప్ సింగ్ (15), దినేశ్ కార్తీక్ (15) వరుస స్థానాల్లో ఉన్నారు.
ఈ మ్యాచ్‌కు ముందు మ్యాచ్‌లో (పంజాబ్) కూడా ఖాతా తెరవకుండానే వెనుదిరిగిన రోహిత్.. మరో చెత్త రికార్డును సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌటైన కెప్టెన్‌గా (11) అపవాదును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్.. గౌతమ్ గంభీర్‌తో సమానంగా 10 సందర్భాల్లో డకౌటైన కెప్టెన్‌గా ఉన్నాడు.