Roger Federer Retirement: టెన్నిస్ కు గుడ్ బై చెప్పిన రోజర్ ఫెడరర్

అభిమానులకు టెన్నిస్ దిగ్గజం స్విస్ సూపర్ స్టార్ రోజర్ ఫెడరర్ భారీ షాక్ ఇచ్చారు. టెన్నిస్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన ఫెడరర్, వచ్చే వారం ఆరంభమయ్యే లేవర్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ తన కెరీర్ లో చివరి టెన్నిస్ టోర్నమెంట్ అంటూ ఫెడరర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించాడు.

  • Written By:
  • Publish Date - September 16, 2022 / 03:34 PM IST

Roger Federer: అభిమానులకు టెన్నిస్ దిగ్గజం స్విస్ సూపర్ స్టార్ రోజర్ ఫెడరర్ భారీ షాక్ ఇచ్చారు. టెన్నిస్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన ఫెడరర్, వచ్చే వారం ఆరంభమయ్యే లేవర్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ తన కెరీర్ లో చివరి టెన్నిస్ టోర్నమెంట్ అంటూ ఫెడరర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించాడు. ఫెడరర్ కు ప్రస్తుతం 41 ఏళ్లు కాగా,చివరిసారిగా ఫెడరర్ గతేడాది జరిగిన వింబుల్డన్ లో పాల్గొన్నాడు. క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకున్న అతడు అక్కడ హర్కాజ్ చేతిలో ఓడిపోయాడు. గత కొంతకాలంగా ఫెడరర్ మోకాలి గాయంతో బాధపడుతున్న ఫెడరర్. ఇప్పటికే రెండు సార్లు సర్జరీ కూడా చేయించుకున్నాడు. అయితే వయో భారం అతడి ఆట పై ప్రభావం చూపింది. దీంతో ఆటకు స్వస్తి పలుకుతున్నట్లు అనూహ్య ప్రకటన చేశారు.

ఫెడరర్ తన తొలి గ్రాండ్ స్లామ్ ను 21 ఏళ్ల వయసులో 2003లో గెలుచుకున్నాడు. ఎంతో ఇష్టమైన వింబుల్డన్ కోటాలో తన జెండా ఎగరవేశాడు. ఇక అక్కడి నుంచి ఫెడరర్ కెరీర్ దూసుకువెళ్లింది. అప్పటి వరకు నంబర్ వన్ గా ఉన్న పీట్ సంప్రాస్ ను వెనక్కి నెట్టి నయా నంబర్ వన్ గా అవతరించాడు. చూస్తుండగానే 14వ గ్రాండ్ స్లామ్ ను సాధించి, పీట్ సంప్రాస్ అత్యధిక టైటిల్స్ రికార్డును సమం చేశాడు. కొంత విరామం తర్వాత 15వ టైటిల్ నెగ్గి పురుషుల విభాగంలో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ నెగ్గిన ప్లేయర్ గా అవతరించాడు ఫెడరర్. అంతేకాకుండా 2018 వింబుల్డన్ ను నెగ్గి 20వ టైటిల్ నెగ్గిన తొలి పురుష ప్లేయర్ గా నిలిచాడు. ప్రస్తుతం నాదల్ 22 టైటిల్స్ తో తొలి స్థానంలో ఉండగా, నొవాక్ జొకోవిచ్ 21 టైటిల్స్ తో రెండో స్థానంలో ఉన్నాడు. ఫెడరర్ మూడో స్థానంలో ఉన్నాడు.

ఫెడరర్ 310 వారాల పాటు నంబర్ వన్ ర్యాంకులో ఉన్నాడు. ఇందులో వరుసగా 237 వారాల పాటు ఫెడరర్ నంబర్ వన్ గా ఉండటం విశేషం. 2004 నుంచి 2008 మధ్య ఫెడరర్ ఈ రికార్డును నెలకొల్పాడు. ఇది ఇప్పటికీ రికార్డుగానే ఉంది. ఫెడరర్ వింబుల్డన్ ను అత్యధికంగా 8 సార్లు నెగ్గాడు. వింబుల్డన్ ను అత్యధిక సార్లు నెగ్గిన ప్లేయర్ గా కూడా ఫెడరర్ ఉన్నారు. ఓవరాల్ గా ఫెడరర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ను 6 సార్లు, ఫ్రెంచ్ ఓపెన్ ను 1సారి, వింబుల్డన్ ను 8 సార్లు, యూఎస్ ఓపెన్ ఐదు సార్లు మొత్తంగా 20 గెలుచుకున్నాడు.