Site icon Prime9

Ravindra Jadeja: రవీంద్ర జడేజా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత.. కారణమేంటంటే..

Ravindra Jadeja

Ravindra Jadeja

Ravindra Jadeja: నాగపూర్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుుల తేడాతో విజయం సాధించింది. 5 నెలల విరామం తర్వాత నాగ్ పూర్ టెస్ట్ లో పునరాగమం చేశాడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.

తన స్పిన్ మాయతో ఆస్ట్రేలియా బ్యాటర్లను దెబ్బతీసిన జడేజా మ్యాన్ ఆఫ్ మ్యాచ్ గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ లో జడేజా ఇన్నింగ్స్ 5 వికెట్లు తీయడంతో పాటు బ్యాట్ తో 70 పరుగులు ఆకట్టు కున్నాడు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 2 రెండు తీశాడు జడేజా.

ఫీజులో 25 శాతం కోత

అయితే, రవీంద్ర జడేజాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి షాక్ ఇచ్చింది. నాగ్ పూర్ టెస్టులో ఐసీపీ నియమాళికి విరుద్ధంగా ఉల్లంఘించినందుకు ఫైన్ వేసింది. అతని ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్టు వెల్లడించింది. ప్రవర్తనా నియమావళిలో నిబంధన 2.20 ని జడేజా ఉల్లంఘించినట్టు ఐసీసీ ప్రకటించింది.

అంతేకాకుండా క్రమశిక్షణా చర్యల కింద జడేజాకు జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. గత 24 నెలల కాలంలో ఇది మొదటి తప్పుగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐసీసీ తెలిపింది.

ఫైన్ కు కారణమేంటంటే..

నాగ్ పూర్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 45 ఓవర్లు ముగిసే సరికి 120/5 స్కోరుతో ఉంది. అప్పటికి జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు.

ఈ క్రమంలో 46 ఓవర్ ని వేసిన జడేజా.. ఓవర్ ప్రారంభించే ముందు జడేజా.. సిరాజ్ దగ్గర ఏదో క్రీమ్ తీసుకుని చేతి వేలికి రాసుకున్నాడు.

అయితే జడేజా వేలికి ఏం రాసుకున్నాడనే అంశం బాగా చర్చనీయాంశ మైంది.

బంతికి క్రీమ్ రాస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజి క్రికెటర్లు స్పందించారు. జడేజా తన వేలికి ఏం పూసుకున్నాడు? అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.

అయితే ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ నొప్పిని తగ్గించే ఆయింట్ మెంట్ ను జడేజా వేలికి రాసుకున్నాడని స్పష్టత ఇచ్చింది.

కానీ, ఫీల్డ్ లో ఉన్న అంపైర్లకు చెప్పకుండా, జడేజా ఆయింట్ మెంట్ ను వాడటంపై ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో జడ్డూ కి జరిమానా విధించడంతో పాటు ఒక డిసిప్లినరీ ను తగ్గించింది.

 

మూడు రోజుల్లోనే ముగిసిన ఆట

తొలి ఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోర్ సాధించింది. తొలిరోజు పట్టుదలతో బ్యాటింగ్ కొనసాగించిన భారత్.. రెండో రోజు ఆధిక్యం సంపాదించింది.

రెండో రోజు మెుదట్లో తడబడిన భారత్..రోహిత్ శర్మ  సెంచరీతో పటిష్ట స్థితిలో నిలించింది. అనంతరం అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా పట్టుదలతో బ్యాటింగ్ చేసి మంచి ఆధిక్యాన్ని సంపాదించి పెట్టారు.

ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ పూర్తిగా విఫలం అయ్యాడు. ఈ దశలో జడేజాకు అక్షర్‌ పటేల్‌ జతయ్యాడు.

క్రీజులో ఉన్న ఇద్దరు స్పిన్నర్లే కావడంతో అవలీలగా బ్యాటింగ్ కొనసాగించారు. దీంతో భారత్ 400 పరుగుల మైలురాయిని చేరుకోగలిగింది.

రెండో ఇన్నింగ్స్ లో కుప్పకూలిన ఆసీస్..

రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. స్పిన్నర్ల ధాటికి బెంబేలెత్తిపోయారు. స్పిన్ మాయజాలంతో అశ్విన్ ఐదు వికెట్లు తీయగా.. అతనికి తోడుగా అక్షర్, జడేజా తమ వంతు పాత్ర పోషించారు.

తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లతో రాణించాడు.

ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో స్టీవ్ స్మిత్ ఒక్కడే 25 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాట్స్ మెన్స్ వెంటవెంటనే పెవిలియన్ చేరారు.

ఇక భారత బౌలింగ్ అశ్విన్ 5 వికెట్లు తీయగా.. షమి, రవీంద్ర చెరో రెండు వికెట్లు తీశారు.

Exit mobile version