PBKS vs RR: చివరి రెండు ఓవర్లలో భారీగా పరుగులు రావడంతో పంజాబ్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. ఆరంభంలో తడబడిన చివర్లో రాణించింది. పంజాబ్ బ్యాటర్లలో కరణ్, జితెష్ శర్మ రాణించారు. చివర్లో షారుఖ్ ఖాన్ రెచ్చిపోయి ఆడటంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది.
రాజస్థాన్ బౌలర్లలో సైనీ మూడు వికెట్లు తీశాడు. జంపా, బౌల్ట్ చెరో వికెట్ తీసుకున్నారు.
చివరి రెండు ఓవర్లలో భారీగా పరుగులు రావడంతో పంజాబ్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. ఆరంభంలో తడబడిన చివర్లో రాణించింది. పంజాబ్ బ్యాటర్లలో కరణ్, జితెష్ శర్మ రాణించారు. చివర్లో షారుఖ్ ఖాన్ రెచ్చిపోయి ఆడటంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది.
రాజస్థాన్ బౌలర్లలో సైనీ మూడు వికెట్లు తీశాడు. జంపా, బౌల్ట్ చెరో వికెట్ తీసుకున్నారు.
చాహల్ వేసిన 19వ ఓవర్లో ఏకంగా 28 పరుగులు వచ్చాయి. కరణ్, షారుఖ్ ఖాన్ సిక్సుల వర్షం కురిపించారు.
పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. సైనీ బౌలింగ్ లో జోరుమీదున్న జితేష్ షర్మ క్యాచ్ ఔటయ్యాడు.
10 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 78 పరుగులు చేసింది.
పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. సైనీ వేసిన బౌలింగ్ లో లివింగ్ స్టన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 50 పరుగుల వద్ద పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది.
పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. వేసిన తొలి ఓవర్లో ఆడమ్ జంపా.. శిఖర్ ధావన్ ను ఔట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో లివింగ్ స్టన్, కరణ్ ఉన్నారు.
పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. జోరుమీదున్న అథర్వ.. సైనీ బౌలింగ్ లో క్యాచ్ ఔటయ్యాడు.
ధావన్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వీలు చిక్కినపుడు వరుస బౌండరీలు రాబడుతున్నాడు.
ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో 12 పరుగులు వచ్చాయి.
సందీప్ శర్మ వేసిన రెండో ఓవర్లో భారీగా పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో 16 పరుగులు రాగా.. అందులో శిఖర్ ధావన్ ఓ ఫోర్, సిక్సర్ కొట్టాడు. చివరి బంతికి అధర్వ ఫోర్ సాధించాడు.
ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్లో రెండు పరుగులతో పాటు ఓ వికెట్ పడింది.
పంజాబ్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. బౌల్డ్ బౌలింగ్ లో ప్రభ్ సిమ్రాన్ సింగ్ క్యాచ్ ఔటయ్యాడు.
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, ఆడమ్ జంపా, ట్రెంట్ బౌల్ట్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అథర్వ తైదే, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కుర్రాన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్
టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.