KKR vs RR: చాహల్ సూపర్ బౌలింగ్ కి కోల్ కతా తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగలిగింది. వెంకటేష్ అయ్యర్ మినహా పెద్దగా ఎవరు రాణించలేదు. నితీష్ రాణా 22 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
రాజస్థాన్ బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. బౌల్డ్ రెండు.. ఆసిఫ్, సందీప్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.
చాహల్ సూపర్ బౌలింగ్ కి కోల్ కతా తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగలిగింది. వెంకటేష్ అయ్యర్ మినహా పెద్దగా ఎవరు రాణించలేదు. నితీష్ రాణా 22 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
రాజస్థాన్ బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. బౌల్డ్ రెండు.. ఆసిఫ్, సందీప్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.
చాహల్ బౌలింగ్ లో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. డేంజర్ బ్యాట్స్ మెన్.. రింకూ సింగ్ ను ఔట్ చేశాడు.
చాహల్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. మెుదట అయ్యర్ ను ఔట్ చేయగా.. ఆ తర్వాత శార్దుల్ ఠాకూర్ ను ఔట్ చేశాడు. ఠాకూర్ ఒక్క పరుగు మాత్రమే చేశాడు.
కీలక దశలో రాణిస్తున్న వెంకటేష్ అయ్యర్ క్యాచ్ ఔటయ్యాడు. చాహల్ బౌలింగ్ లో క్యాచ్ ఔటయ్యాడు. చాహల్ రెండో వికెట్ తీసుకున్నాడు.
వెంకటేష్ అయ్యర్ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 39 బంతుల్లో 50 పరుగులు చేశాడు. కీలక సమయంలో వెంకటేష్ రాణిస్తున్నాడు.
చాహల్ వేసిన 13 వ ఓవర్లో భారీగా పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో ఓ సిక్స్, రెండు ఫోర్లు వచ్చాయి.
కోల్ కతా మూడో వికెట్ కోల్పోయింది. చాహాల్ తొలి ఓవర్లోనే రాణాను ఔట్ చేశాడు.
అశ్విన్ వేసిన ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. వెంకటేష్ అయ్యార్ రెండు సిక్సలు కొట్టగా.. చివరి బంతికి నితీష్ రాణా ఫోర్ కొట్టాడు.
8 ఓవర్లు ముగిసేసరికి కోల్ కతా 50 పరుగులు చేసింది.
పవర్ ప్లే ముగిసేసరికి కోల్ కతా 37 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరు ఔటవ్వడంతో కోల్ కతా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తోంది.
కోల్ కతా రెండో వికెట్ కోల్పోయింది. బౌల్డ్ బౌలింగ్ లో గుర్బాజ్ క్యాచ్ ఔటయ్యాడు.
సందీప్ శర్మ వేసిన రెండు బంతులను గుర్బాజ్ రెండు సిక్సర్లుగా మలిచాడు.
కోల్ కతా తొలి వికెట్ కోల్పోయింది. బౌల్డ్ బౌలింగ్ లో రాయ్ క్యాచ్ ఔటయ్యాడు. బౌండరీ వద్ద హెట్ మేయర్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు.
సందీప్ శర్మ వేసిన రెండో ఓవర్లో 4 పరుగులే వచ్చాయి.
ట్రెంట్ బౌల్డ్ వేసిన తొలి ఓవర్లో 6 పరుగులు వచ్చాయి.
ట్రెంట్ బౌల్డ్ తొలి ఓవర్ వేస్తున్నాడు.
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్), జో రూట్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, కేఎం ఆసిఫ్, యుజువేంద్ర చాహల్
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జేసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోల్‌కతా మొదట బ్యాటింగ్ చేయనుంది.