GT vs RR: వరుస విజయాలతో రాజస్థాన్ దూసుకుపోతుంది. ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వెళ్లింది. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ విజయం సాధించింది. ఇటు శాంసన్.. అటు హెట్‌మయర్ విధ్వంసం సృష్టించడంతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే రాయల్స్ విజయాన్ని అందుకుంది.
చెలరేగిన హెట్ మయర్.. (GT vs RR)
వరుస విజయాలతో రాజస్థాన్ దూసుకుపోతుంది. ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వెళ్లింది. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ విజయం సాధించింది. ఇటు శాంసన్.. అటు హెట్‌మయర్ విధ్వంసం సృష్టించడంతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే రాయల్స్ విజయాన్ని అందుకుంది.
178 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన రాజస్థాన్ మెుదట తడబడిన.. చివర్లో విండీస్ స్టార్ హెట్ మయర్ విధ్వంసం సృష్టించి జట్టుకు విజయాన్ని అందించారు. పది ఓవర్లు ముగిసేసరికి 53 పరుగులే చేసిన రాయల్స్.. మరో నాలుగు బంతులు మిగిలుండగానే పని పూర్తి చేసింది.
రసవత్తరంగా సాగిన మ్యాచ్ లో రాజస్థాన్ మూడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ను ఓడించింది. హెట్‌మయర్ 56 పరుగులు.. సంజు శాంసన్ 60 పరుగులతో చెలరేగారు.
మిల్లర్ 46 పరుగులు.. శుభ్‌మన్ గిల్ 45 పరుగులు చేయడంతో.. మొదట గుజరాత్ 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.
హెట్‌మయర్, సంజు మెరుపులతో లక్ష్యాన్ని రాజస్థాన్ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
అదరగొట్టి ఇద్దరు..
రాజస్థాన్ బ్యాటింగ్ చూస్తే.. ఆ జట్టు కనీసం 100 పరుగులైన చేస్తుందా అని అనుకున్నారు. ఆరు ఓవర్లకు 26/2.. 10 ఓవర్లు ముగిసేసరికి 53/3 పరిస్థితిలో ఉంది.
కానీ మెరుపు విన్యాసాలతో సంజు శాంసన్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో హెట్ మయర్ చెలరేగడంతో విజయాన్ని రాజస్థాన్ విజయాన్ని లాగేసుకుంది.
చివరి 5 ఓవర్లలో రాజస్థాన్ 64 పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ స్వేచ్ఛగా చెలరేగిపోయిన హెట్‌మయర్ సిక్స్‌లు, ఫోర్లతో అదరగొట్టాడు.
చివరి ఓవర్లో 7 పరుగులు చేయాల్సివచ్చింది. తొలి బంతికి రెండు తీసిన హెట్‌మయర్.. తర్వాతి బంతికి సిక్స్ కొట్టి పని పూర్తి చేశాడు.
అంతకముందు.. గిల్, హార్దిక్ గుజరాత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దితే.. మిల్లర్, అభినవ్ మెరుపు ముగింపునిచ్చారు. దీంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 177 పరుగులు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు మంచి ఆరంభం లభించలేదు. సాహా, సుదర్శన్ పెవిలియన్ చేరారు. ఆ జట్టు 5 ఓవర్లలో 32/2తో నిలిచింది.
గిల్, పాండ్యా ఇద్దరూ చక్కగా బ్యాటింగ్ చేశారు. 59 పరుగుల వీరి భాగస్వామ్యం గుజరాత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.
11వ ఓవర్లో హార్దిక్‌ను చాహల్ ఔట్ చేసేటప్పటికి గుజరాత్ స్కోరు 91. అక్కడ గిల్‌కు మిల్లర్ తోడైనా పరుగులు ఎక్కువ వేగంగా రాలేదు.
తర్వాతి ఓవర్లోనే గిల్ నిష్క్రమించినా.. మిల్లర్, అభినవ్ మనోహర్ చెలరేగిపోవడంతో టైటాన్స్ ఆఖరి నాలుగు ఓవర్లలో 52 పరుగులు రాబట్టింది.
ఈ జంట అయిదో వికెట్‌కు 22 బంతుల్లోనే 45 పరుగులు జోడించింది.