Site icon Prime9

CSK vs MI: రహానే విధ్వంసం.. చెన్నైకి వరుసగా రెండో విజయం

csk

csk

CSK vs MI: ఐపీఎల్ లో ముంబయిని వరుస ఓటములు వెంటాడుతున్నాయి. ఈ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది ముంబయి. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా రోహిత్ సేనకు పేరుంది. అందులోను హోమ్ గ్రౌండ్ లో ఓడిపోవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ. గతేడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి ఇండియన్స్‌ ఈ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పరాజయం చవిచూసింది.

ఆరంభంలో ధాటిగా ఆడిన.. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. స్పిన్నర్ల ధాటికి విలవిలలాడింది. ఇక ఈ మ్యాచ్ లో అజింక్య రహానే విధ్వంసం ప్రదర్శించాడు.

ఈ ఒక్క మ్యాచ్ తో మెల్లిగా ఆడతాడు అనే వారికి గట్టి సమాధానం ఇచ్చాడు.

ముంబైకి చెన్నై చెక్‌ (CSK vs MI)

ఐపీఎల్ లో ముంబయిని వరుస ఓటములు వెంటాడుతున్నాయి. ఈ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది ముంబయి.

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా రోహిత్ సేనకు పేరుంది. అందులోను హోమ్ గ్రౌండ్ లో ఓడిపోవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ.

గతేడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి ఇండియన్స్‌ ఈ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పరాజయం చవిచూసింది.

ఆరంభంలో ధాటిగా ఆడిన.. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. స్పిన్నర్ల ధాటికి విలవిలలాడింది.

ఇక ఈ మ్యాచ్ లో అజింక్య రహానే విధ్వంసం ప్రదర్శించాడు.

ఈ ఒక్క మ్యాచ్ తో మెల్లిగా ఆడతాడు అనే వారికి గట్టి సమాధానం ఇచ్చాడు.

ముంబయి జట్టుకి చెన్నై సూపర్ కింగ్స్ షాక్ ఇచ్చింది. ముంబయి హోమ్ గ్రౌండ్ లో వారిని మట్టికరిపించింది.

అజింక్య రహానే విధ్వంసంతో 7 వికెట్ల తేడాజో చెన్నై విజయం సాధించింది.

మెుదట బ్యాటింగ్ చేసిన ముంబయి.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆరంభంలో ధాటిగా ఆడిన.. తర్వాత కుప్పకూలింది.

దీంతో ముంబయి తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఇషాన్‌ కిషన్‌ (21 బంతుల్లో 32; 5 ఫోర్లు), టిమ్‌ డేవిడ్‌ (22 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు.

ఇక ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎన్నికయ్యాడు. లక్ష చేదనలో చెన్నై 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేసింది.

అజింక్య రహానే (27 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా…రుతురాజ్‌ గైక్వాడ్‌ (36 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు.

కీలక భాగస్వామ్యం..

ఛేదనలో తొలి ఓవర్లోనే చెన్నై జట్టు కాన్వే (0) వికెట్‌ కోల్పోయింది. అయితే రహానే దూకుడైన బ్యాటింగ్‌తో స్కోరు వేగంగా సాగింది.

ముఖ్యంగా అర్షద్‌ వేసిన ఓవర్లో అతను చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో తొలి ఐదు బంతుల్లో రహానే వరుసగా 6, 4, 4, 4, 4 బాదడం అతని సత్తాను చూపించింది.

ఈ ఓవర్లో మొత్తం 23 పరుగులు వచ్చాయి. చావ్లా ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రహానే 19 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఈ సీజన్‌ ఐపీఎల్‌లో ఇదే వేగవంతమైన అర్ధ సెంచరీ కాగా…ఐపీఎల్‌లో 2020 తర్వాత రహానేకు ఇదే మొదటి ఫిఫ్టీ కావడం మరో విశేషం.

 

Exit mobile version