PBKS vs DC: దిల్లీ భారీ స్కోర్ సాధించింది. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ రూస్సోవ్ విధ్వంసం సృష్టించాడు. 37 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. అంతకుముందు.. దిల్లీ ఓపెనర్లు రాణించారు. వార్నర్ 46 పరుగులు చేయగా.. పృథ్వి షా 54 పరుగులు చేశాడు. చివర్లో సాల్ట్ రెండు సిక్సులు, రెండు ఫోర్లతో చెలరేగాడు. దీంతో 20 ఓవర్లలో దిల్లీ 213 పరుగులు చేసింది.
పంజాబ్ బౌలర్లలో సామ్ కరణ్ ఒక్కడే రెండు వికెట్లు తీసుకున్నాడు.