PT Usha: పరుగుల రాణి పీటీ ఉష మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకోనున్నారు. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నిక లాంఛనమైంది. ఈ మేరకు అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. డిసెంబర్లో జరిగే భారత ఒలింపిక్ సంఘం అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటు 14 మంది కార్యవర్గ సభ్యులు కూడా నామినేషన్లు సమర్పించారు. అధ్యక్ష పదవికి మరెవరూ నిమినేషన్ వేయలేదు. దీంతో పీటీ ఉష ఎన్నిక దాదాపు ఖాయమైంది. అథ్లెటిక్స్‌లో ఎన్నో పథకాలు సొంతం చేసుకున్న ఉష.. కీర్తి కిరీటంలో ఇది మరో మైలురాయి.
ఇండియన్ ఒలింపిక్ అసోషియేషన్లోని వివిధ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో అధ్యక్షుడు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రెండు వైస్ ప్రెసిడెంట్ స్థానాలు, కోశాధికారి, రెండు జాయింట్ సెక్రటరీ స్థానాలు, 6 కార్యనిర్వాహక మండలి సభ్యుల స్థానాలు ఉన్నాయి. ఈ ఆరుగురిలో ఇద్దరు అథ్లెట్స్ కమిషన్ ప్రతినిధులు ఉంటారు. ఇప్పటివరకు పీటీ ఉష వివిధ ఆసియా గేమ్స్‌లో గోల్డ్ మెడల్స్సాధించారు. 1984లో జరిగిన ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హర్డల్స్ ఈవెంట్ఫైనల్లో నాలుగో స్థానంలో నిలిచారు.