Naveen Ul vs Virat: ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా ఇటీవల బెంగళూరు రాయల్ చాలెంజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ, నవీనుల్, గౌతమ్ గంభీర్ మధ్య ఎంత పెద్ద గొడవ జరిగిందో అందరికీ తెలుసు. అంతటితో ఆగిపోని వివాదం మ్యాచ్ తర్వాతి రోజు సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా కొనసాగింది. కోహ్లీ, నవీనుల్ ఇద్దరూ స్టేటస్ రూపంలో విమర్శలు చేసుకున్నారు. అయితే ఆ గొడవ వేడి ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టుంది. ఎందుకంటే మంగళవారం నవీనుల్ పెట్టిన సోషల్ మీడియా స్టేటస్ చూస్తే అర్ధం అవుతోంది.
మామిడి పండ్లను తింటూ..(Naveen Ul vs Virat)
మంగళవారం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ , ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ ఒక్క పరుగు కే పెవిలియన్ చేరాడు. దీంతో గంభీర్ , నవీనుల్ పండగ చేసుకున్నట్టున్నారు. కోహ్లీ అవుట్ అవ్వగానే నవీనుల్ హక్ ఇన్ స్టా లో ఓ స్టోరీ పెట్టాడు. ముంబై, ఆర్సీబీ మ్యాచ్ చూస్తూ.. మామిడి పండ్లను తింటూ.. ‘స్వీట్ మ్యాంగోస్ ’ అని కామెంట్ పెట్టాడు. కోహ్లీ అవుట్ అవ్వగానే నవీనుల్ ఈ పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. కోహ్లీ ని ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టినట్టు పలువరు కామెంట్స్ చేస్తున్నారు.
Naveen Ul Haq’s Instagram story. pic.twitter.com/aebF7H6gS9
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 9, 2023
గంభీర్ కూడా..
మరో వైపు లక్నో జట్టు మెంటర్ గౌతమ్ గంభీర్ కూడా పరోక్షంగా పోస్ట్ పెట్టాడు. ముంబై బౌలర్ బెహ్రెన్ డార్ఫ్ బౌలింగ్ లో కోహ్లీ ఔట్ అయ్యాడు. దీంతో బెహ్రెన్ ను ప్రశంసిస్తూ గంభీర్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాడు. అద్భుత మైన బౌలర్ అంటూ గంభీర్ ప్రశంసించాడు. కాగా, గంభీర్ గతంలో కూడా కోహ్లీ ని విమర్శిస్తూ పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోహ్లీ పై చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Meanwhile Goutham Gambhir 🙂#RCBvsMI pic.twitter.com/HJKcb4XJ9v
— Manoj Karoshi (@karoshimanoj) May 9, 2023