MI Vs RCB: బెంగళూరు భారీ స్కోర్ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన బెంగళూరు.. మెుదట్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత డూప్లెసిస్, మ్యాక్స్ వెల్ చెలరేగి ఆడటంతో భారీ స్కోర్ సాధించింది. చివర్లో దినేష్ కార్తీక్ రాణించాడు.
ముంబయి బౌలింగ్ లో.. బెహర్డింఫ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. కార్తీకేయ, గ్రీన్, జోర్డాన్ చెరో వికెట్ తీసుకున్నారు.
బెంగళూరు భారీ స్కోర్ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన బెంగళూరు.. మెుదట్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత డూప్లెసిస్, మ్యాక్స్ వెల్ చెలరేగి ఆడటంతో భారీ స్కోర్ సాధించింది. చివర్లో దినేష్ కార్తీక్ రాణించాడు.
ముంబయి బౌలింగ్ లో.. బెహర్డింఫ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. కార్తీకేయ, గ్రీన్, జోర్డాన్ చెరో వికెట్ తీసుకున్నారు.
జోర్డాన్ బౌలింగ్ లో దినేశ్ కార్తీక్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను గ్రీన్ వదిలేశాడు.
బెంగళూరు ఐదో వికెట్ కోల్పోయింది. 65 పరుగులు చేసిన డూప్లెసిస్.. గ్రీన్ బౌలింగ్ లో క్యాచ్ ఔటయ్యాడు.
బెంగళూరు నాలుగో వికెట్ కోల్పోయింది. కార్తీకేయ బౌలింగ్ లో లమ్రోర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
బెంగళూరు మూడో వికెట్ కోల్పోయింది. జోరుమీదున్న మ్యాక్స్ వెల్ క్యాచ్ ఔటయ్యాడు. 33 బంతుల్లో 68 పరుగులు చేశాడు మ్యాక్స్ వెల్.
బెంగళూరు భారీ స్కోర్ దిశగా పోతుంది. 12 ఓవర్లలో 131 పరుగులు చేసింది.
డూప్లెసిస్ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 30 బంతుల్లో50 పరుగులు చేశాడు.
మ్యాక్స్ వెల్, డూప్లేసిస్ సిక్సుల వర్షం కురిపిస్తున్నారు. 9.3 ఓవర్లలోనే బెంగళూరు 101 పరుగులు చేసింది.
మాక్స్ వెల్ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 25 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
మ్యాక్స్ వెల్ సిక్సులతో దాడి చేస్తున్నాడు. జోర్డాన్ వేసిన ఓవర్లో రెండు సిక్సులు కొట్టాడు.
పవర్ ప్లే లో బెంగళూరు 56 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మాక్స్ వెల్, డూప్లెసిస్ ఉన్నారు.
5 ఓవర్లు పూర్తయ్యేసరికి బెంగళూరు 45 పరుగులు చేసింది. ఐదో ఓవర్లో 16 పరుగులు వచ్చాయి.
బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది. బెహ్రెండోర్ఫ్ బౌలింగ్ లో అనూజ్ రావత్ క్యాచ్ ఔటయ్యాడు. 16 పరుగుల వద్ద బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది.
పియుష్ చావ్లా వేసిన రెండో ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. డూప్లెసిస్ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు.
బెంగళూరు జట్టు తొలి వికెట్ కోల్పోయింది. బెహ్రెండోర్ఫ్ బౌలింగ్ లో కోహ్లీ కీపర్ క్యాచ్ ఔటయ్యాడు. కోహ్లీ ఒక్క పరుగు మాత్రమే చేశాడు.
జాసన్ బెహ్రెండోర్ఫ్ తొలి ఓవర్ వేస్తున్నాడు.
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, ఆకాశ్ మధ్వల్, కుమార్ కార్తికేయ, జాసన్ బెహ్రెండోర్ఫ్
విరాట్ కోహ్లీ, డు ప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, విజయ్ కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్
టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది.