గుజరాత్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ అర్దసెంచరీతో రాణించాడు. చివర్లో అభినవ్ మనోహోర్, మిల్లర్ దాటిగా ఆడి స్కోర్ ను పరుగులు పెట్టించారు. చివర్లో తేవాటియా సిక్సులతో విరుచుకుపడ్డాడు.
ముంబయి బౌలింగ్ లో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీసుకున్నాడు. కార్తీకేయ, మెరిడిత్, టెండూల్కర్, బెహరెండఫ్ తలో వికెట్ పడగొట్టారు.
గుజరాత్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ అర్దసెంచరీతో రాణించాడు. చివర్లో అభినవ్ మనోహోర్, మిల్లర్ దాటిగా ఆడి స్కోర్ ను పరుగులు పెట్టించారు. చివర్లో తేవాటియా సిక్సులతో విరుచుకుపడ్డాడు.
ముంబయి బౌలింగ్ లో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీసుకున్నాడు. కార్తీకేయ, మెరిడిత్, టెండూల్కర్, బెహరెండఫ్ తలో వికెట్ పడగొట్టారు.
19 ఓవర్లో భారీగా పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో మూడు సిక్సులు బాదారు గుజరాత్ బ్యాట్స్ మెన్స్.
గుజరాత్ ఐదో వికెట్ కోల్పోయింది. అభినవ్ మనోహర్ క్యాచ్ ఔట్ రూపంలో వెనుదిరిగాడు.
కామెరూన్ గ్రీన్ వేసిన ఓవర్లో 22 పరుగులు వచ్చాయి. ఇందులో మూడు సిక్సులు ఉన్నాయి.
కామెరూన్ గ్రీన్ వేసిన ఓవర్లో వరుసగా రెండు సిక్సులు వచ్చాయి. అభినవ్ వరుసగా రెండు సిక్సులు కొట్టాడు.
17 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 150 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మిల్లర్, అభినవ్ ఉన్నారు. వీళ్లిద్దరు 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు.
15 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ నాలుగు వికెట్లకు 130 పరుగులు చేసింది. పియుషీ చావ్లా వేసిన ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు, ఓ సిక్సర్ వచ్చింది. క్రీజులో మిల్లర్, అభినవ్ ఉన్నారు.
గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. పియూష్ చావ్లా బౌలింగ్ లో విజయ్ శంకర్ క్యాచ్ ఔటయ్యాడు. లాంగ్ ఆన్ లో టిమ్ డేవిడ్ క్యాచ్ అందుకున్నాడు.
గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. కార్తీకేయ బౌలింగ్ లో గిల్ క్యాచ్ ఔటయ్యాడు. లాంగ్ ఆన్ లో సూర్య సింపుల్ క్యాచ్ అందుకున్నాడు. గిల్ 34 బంతుల్లో 56 పరుగులు చేశాడు.
శుభ్ మన్ గిల్ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 30 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు ఓ సిక్సర్ ఉంది. దీంతో 10 ఓవర్లకు గుజరాత్ 84 పరుగులు చేసింది.
కార్తీకేయ వేసిన 8 ఓవర్లో కేవలం 8 పరుగులు మాత్రమే వచ్చాయి.
7 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 55 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో గిల్, విజయ్ శంకర్ ఉన్నారు.
పియుష్ చావ్లా వేసిన 7 ఓవర్లో హార్దీక్ పాండ్యా క్యాచ్ ఔటయ్యాడు. బౌండరీ లైన్ వద్ద సూర్య అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. పాండ్యా 14 బంతుల్లో 13 పరుగులు చేశాడు.
పవర్ ప్లే ముగిసేసరికి గుజరాత్ 50 పరుగులు చేసింది. 6 ఓవర్లో గిల్ వరుసగా రెండు ఫోర్లు ఓ సిక్సర్ కొట్టాడు. చివరి ఓవర్లో.. 17 పరుగులు వచ్చాయి.
4 ఓవర్లు పూర్తయ్యేసరికి గుజరాత్ వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో గిల్, పాండ్యా ఉన్నారు.
గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ లో సాహా క్యాచ్ ఔటయ్యాడు. సాహా 7 బంతుల్లో 4 పరుగులు చేశాడు.
రెండో ఓవర్లో గుజరాత్ 8 పరుగులు చేసింది.
అర్జున్ టెండూల్కర్ వేసిన తొలి ఓవర్లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు.
గుజరాత్ బ్యాటింగ్ ప్రారంభించింది. అర్జున్ టెండూల్కర్ తొలి ఓవర్ వేస్తున్నాడు.
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, అర్జున్ టెండూల్కర్, రిలే మెరెడిత్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్
వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.