Site icon Prime9

WPL FINAL: డబ్ల్యూపీఎల్‌ ఫైనల్.. తొలి టైటిల్‌ అందుకున్న ముంబై ఇండియన్స్

wpl final

wpl final

WPL FINAL: మహిళల ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. దిల్లీ తో జరిగిన ఫైనల్ లో గెలిచి తొలి ట్రోఫీని ముద్దాడింది. టోర్నీ ఆరంభం నుంచి మెరుగైన ఆటతో ఆకట్టుకున్న ముంబై.. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో గెలిచింది.

ఉత్కంఠగా సాగిన మ్యాచ్.. (WPL FINAL)

మహిళల ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. దిల్లీ తో జరిగిన ఫైనల్ లో గెలిచి తొలి ట్రోఫీని ముద్దాడింది. టోర్నీ ఆరంభం నుంచి మెరుగైన ఆటతో ఆకట్టుకున్న ముంబై.. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో గెలిచి ట్రోఫీని గెలిచింది. ముంబై ఇండియన్స్ కి ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుంది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో దిల్లీ పోరాడి ఓడింది. ముంబై జట్టులో నాట్‌ సీవర్‌ 60 పరుగులతో కీలక పాత్ర పోషించింది. దీంతో ఏడు వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది.

తొలుగు బ్యాటింగ్ చేసి దిల్లీ క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లకు 131 పరుగులే చేయగలిగింది.

ముంబై బౌలింగ్ లో ఇసీ వాంగ్‌ (3/42), హేలీ మాథ్యూస్‌ (3/5), అమేలియా కెర్‌ (2/18) విజృంభించారు.

లానింగ్‌ (35; 29 బంతుల్లో 5×4) దిల్లీ టాప్‌ స్కోరర్‌.

చాలా తక్కువ స్కోరుకే కుప్పకూలేలా కనిపించిన ఆ జట్టును చివరి వరుస బ్యాటర్లు

శిఖా పాండే (27 నాటౌట్‌; 17 బంతుల్లో 3×4, 1×6), రాధా యాదవ్‌ (27 నాటౌట్‌; 12 బంతుల్లో 2×4, 2×6) ఆదుకున్నారు.

సీవర్‌తో పాటు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (37; 39 బంతుల్లో 5×4), అమేలియా కెర్‌ (14 నాటౌట్‌; 8 బంతుల్లో 2×4) రాణించడంతో లక్ష్యాన్ని ముంబయి 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

 

లక్ష్య ఛేదనలో ముంబై మెుదట్లో తడబడింది. దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. ముంబయి ఛేదన కష్టంగానే సాగింది.

4 ఓవర్లలో 24 పరుగులకే ఓపెనర్లు హేలీ (13), యాస్తిక భాటియా (4)లను ముంబయి కోల్పోయింది. ఆ దశలో సీవర్‌, హర్మన్‌ప్రీత్‌ నిలిచారు.

బ్యాటర్లు దాటిగా ఆడకపోవడంతో సాధించాల్సిన రన్‌రేట్‌ పెరుగుతూ పోయింది. 11 ఓవర్లలో ఆ జట్టు స్కోరు 55 మాత్రమే. ఆ తర్వాత బ్యాటర్లు కాస్త వేగం పెంచారు.

చివరి రెండు ఓవర్లలో 21 పరుగులు చేయాల్సిన స్థితిలో ముంబయిపై ఒత్తిడీ పెరిగింది.

కానీ సీవర్‌ ఓ ఫోర్‌, అమేలియా కెర్‌ రెండు ఫోర్లు కొట్టడంతో 19వ ఓవర్లో జొనాసెన్‌ 16 పరుగులు సమర్పించుకుంది. దీంతో దిల్లీ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

దిల్లీ బ్యాటర్లకు కళ్లెం వేశారు ముంబై బౌలర్లు. నిజానికి దిల్లీ చేసిన 131 కూడా అస్సలు ఊహించని స్కోరే. ఎందుకంటే 79 పరుగులకే 9 వికెట్లు చేజార్చుకున్న ఆ జట్టు ఫైనల్లో చాలా ముందే చేతులెత్తేసినట్లనిపించింది. చివరి జంట.. టెయిలెండర్లు శిఖ పాండే, రాధా యాదవ్‌ల అద్భుత పోరాట పుణ్యమా అని ఆ జట్టు కాస్త పోరాడగలిగే స్కోరు సాధించింది.

Exit mobile version