Mumbai Indians: ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ప్రతి సీజన్ లో ఎంతో బలంగా కనిపించే ఈ జట్టుకు ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్లలో ఎవరికి సాధ్యం కాని రికార్డులను ముంబై ఇండియన్స్ నమోదు చేసింది. మరి ఆ రికార్డులు ఏంటో ఓసారి చూద్దాం.
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ప్రతి సీజన్ లో ఎంతో బలంగా కనిపించే ఈ జట్టుకు ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్లలో ఎవరికి సాధ్యం కాని రికార్డులను ముంబై ఇండియన్స్ నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ ఓ జట్టు మాత్రమే కాదు, విన్నింగ్ మెషీన్ అని అంటుంటారు క్రికెట్ విశ్లేషకులు. ప్రతి సీజన్ లో ఈ జట్టు ప్రదర్శన అలా ఉంటుంది మరి.
ఇప్పటి వరకు జరిగిన సీజన్లలో ఐదుసార్లు ఈ జట్టు ట్రోఫిని నెగ్గింది. దీంతో పాటు అనేక రికార్డులు నమోదు చేసింది.
ఐపీఎల్ లో ముంబై జట్టు ఇప్పటివరకు 186 మ్యాచులు ఆడగా.. అందులో 108 మ్యాచులు గెలిచింది. మరే జట్టు ఇన్ని విజయాలు సాధించలేదు.
దీంతో పాటు.. లీగ్ చరిత్రలో 100 మ్యాచ్ లు గెలిచిన ఏకైక జట్టుగా ముంబై కొనసాగుతుంది.
ఐపీఎల్ చరిత్రలో ప్రత్యర్థిని భారీ పరుగుల తేడాతో ఓడించిన జట్టుగా ముంబైకి పేరుంది.
దిల్లీపై ముంబయి 2017లో ఈ విజయాన్ని సాధించింది. ప్రత్యర్థిని 146 పరుగుల తేడాతో ఓడించింది.
ముంబై ఇప్పటివరకు ఐదు ట్రోఫీలు గెలుచుకుంది. 2013, 2015, 2017, 2019, 2020ల్లో విజేతగా నిలిచింది.
ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. ఈ జట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. మిగతా జట్లకంటే.. ముంబై బౌలర్లు 40 మెయిడిన్ ఓవర్లు వేశారు.
ఇప్పటి వరకు ముంబై టీమ్ 1308 సిక్స్‌లు, 2980 ఫోర్లు కొట్టారు. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధికం.
ఐపీఎల్ లో లక్ష్య ఛేదన కూడా ముంబైదే. 87 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా మీద 2008లో గెలుపొందింది.
చెన్నై చెపాక్ స్టేడియంలో ముంబైకి మంచి రికార్డు ఉంది. గత పదేళ్లుగా ముంబయిని ఓడించిన జట్టే లేదు. ఆడిన ప్రతి మ్యాచ్‌లో గెలుపు సాధించింది.
వందకు పైగా వికెట్లు పడగొట్టిన ముగ్గురు బౌలర్లు ముంబయి జట్టులో ఉన్నారు. లసిత్ మలింగ (122 వికెట్లు), హర్భజన్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా (120) ఆ ఘనత సాధించారు.
ఒక ఇన్నింగ్స్‌లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ కూడా ముంబయి బౌలర్‌దే. అల్జారీ జోసెఫ్ 2019లో హైదరాబాద్ మీద 6/12తో అద్భుత ప్రదర్శన చేశాడు.