US Open 2022: నాదల్‌ వారసుడిగా అల్కారజ్.. 19 ఏళ్లకే చరిత్ర తిరగరాసిన స్పెయిన్‌ ఆటగాడు

టిన్నిస్ ఆటలో అత్యంత ప్రతిష్టాత్మక టైటిల్ అయిన గ్రాండ్ స్లామ్ టైటిల్ ను స్పెయిన్‌ యువ ఆటగాడు దక్కించుకున్నాడు. కార్లోస్‌ అల్కారజ్‌ రాకెట్‌లా దూసుకొచ్చి గ్రాండ్ స్లామ్ ను కైవసం చేసుకున్నాడు.

Grand Slam Title-2022: టెన్నిస్ ఆటలో అత్యంత ప్రతిష్టాత్మక టైటిల్ అయిన గ్రాండ్ స్లామ్ టైటిల్ ను స్పెయిన్‌ యువ ఆటగాడు దక్కించుకున్నాడు. కార్లోస్‌ అల్కారజ్‌ రాకెట్‌లా దూసుకొచ్చి గ్రాండ్ స్లామ్ ను కైవసం చేసుకున్నాడు.

నిన్న మొన్నటి వరకు సీనియర్ల ప్రభావముతో అంతగా వెలుగులోకి రాకుండా ఉన్నఅల్కారజ్‌ యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచి రఫెల్‌ నాదల్‌ వారసుడిగా ముందుకొచ్చాడు. ఆదివారం జరిగిన యూఎస్ ఓపెన్ టెన్నిస్ ఫైనల్లో స్పెయిన్ ఆటగాడు అల్కారజ్‌ ప్రతిభకనపరిచారు. 6-4,2-6,7-6,6-3 స్కోరుతో నార్వేకు చెందిన కాస్పర్‌ రూడ్‌ను ఓడించి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ అందుకున్నాడు. ఈ విజయంతో ప్రథమ స్థానానికి ఎగబాకాడు. దానితో నంబర్‌వన్‌ ర్యాంక్‌ దక్కించుకున్న అతి పిన్న వయస్కుడిగా 19 ఏళ్ల అల్కారజ్‌ రికార్డుకెక్కాడు. 2001లో లేటన్‌ హెవిట్‌ 20 ఏళ్ల వయసులో అగ్రస్థానం చేరుకుని నెలకొల్పిన రికార్డును తాజాగా ఈ స్పెయిన్‌ ఆటగాడు తిరగరాశాడు.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే మూడున్నర గంటల పాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో అల్కారజ్‌ పదునైన సర్వీసులతో, డ్రాప్‌ షాట్లతో ప్రేక్షకులను కళ్లు తిప్పుకోకుండా చేశాడు. ఆఖరికి గ్రాండ్ స్లామ్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు.

ఇదీ చదవండి: Neeraj Chopra: నీరజ్ కు డైమండ్ దాసోహం