Site icon Prime9

IPL 2023: ఐపీఎల్‌లో ఫిక్సింగ్ కలకలం.. బీసీసీఐకి ఫిర్యాదు చేసిన మహ్మద్ సిరాజ్

siraj

siraj

IPL 2023: ఐపీఎల్ లో ఫిక్సింగ్ కలకలం రేపింది. ఈ వ్యవహారంపై బీసీసీఐకి మహమ్మద్ సిరాజ్ ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఆర్సీబీ అంతర్గత వ్యవహారాల గురించి తెలియజేయాలంటూ ఓ వ్యక్తి క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ను సంప్రందించాడు. అప్రమత్తమైన సిరాజ్.. విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఫిక్సింగ్ కలకలం.. (IPL 2023)

ఐపీఎల్ లో ఫిక్సింగ్ కలకలం రేపింది. ఈ వ్యవహారంపై బీసీసీఐకి మహమ్మద్ సిరాజ్ ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఆర్సీబీ అంతర్గత వ్యవహారాల గురించి తెలియజేయాలని ఓ బుకీ మహ్మద్ సిరాజ్ ను సంప్రందించాడు. అప్రమత్తమైన సిరాజ్.. ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక అధికారులకు సమాచారం ఇచ్చాడు.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో మ్యాచులు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రతి మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగుతుంది.

చివరి ఓవర్ వరకు విజయం కోసం జట్లు పోరాటం చేస్తు.. అభిమానులకు కిక్ ఇస్తున్నాయి. దీంతో బెట్టింగులు సైతం జోరుగా సాగుతున్నాయి.

ఈ క్రమంలో ఫిక్సింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అప్రమత్తమైన సిరాజ్.. ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగంకు ఫిర్యాదు చేశాడు. దీంకో బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం రంగంలోకి దిగింది.

అయితే సిరాజ్ ను సంప్రదించింది బుకీ కాదని, ఆటో డ్రైవర్ అని తేలింది.

అతను బెట్టింగ్ వ్యవహారంలో భారీగా డబ్బు పోగొట్టుకున్నాడని బీసీసీఐ అవినితి నిరోధక విభాగం అధికారులు తేల్చారు.

మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నాడు.

ఈ మేరకు ఓ వ్యక్తి సిరాజ్ ని సంప్రదించి.. మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.

రంగంలోకి దిగిన వారు సదరు వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అతను బుకీ కాదని తేల్చారు.

సిరాజ్‌ను సంప్రదించింది హైదరాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ అని బీసీసీఐ నిర్ధారణకు వచ్చింది.

అయితే, సదరు వ్యక్తి ఐపీఎల్‌లో బెట్టింగ్ లు పెట్టి భారీగా డబ్బును కోల్పోయాడని తెలిసింది.

Exit mobile version