Irfan Pathan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఫైనల్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ భారీ ఎత్తున తరలి వచ్చారు. అయితే గుజరాత్ టైటాన్స్ కంటే చెన్నై సూపర్ కింగ్స్‌కే అభిమానుల మద్దతు ఎక్కువగా కనిసిస్తోంది. అందుకు కారణం ఒకే ఒక్కడు మహేంద్ర సింగ్ ధోని. చెన్నై సారథికి ఇదే చివరి సీజన్‌గా అనుకుంటున్న నేపథ్యంలో ఫ్యాన్స్ భారీ సంఖ్యలో ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు రెడీ అయ్యారు. కాగా, ఈ క్రమంలో ధోనీకి అంతులేని అభిమానుల గురించి టీంఇండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పలు ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఇర్ఫాన్ ఏమన్నారంటే..(Irfan Pathan)
‘చెన్నై సూపర్ కింగ్స్ ని ప్రతి జట్టూ అభిమానిస్తుంది. మరీ ముఖ్యంగా ఆరంభంలో తమిళనాడు ప్రజలు కాస్త సమయం తీసుకున్నారు. అయితే ఒక్కసారి వారు ప్రేమించడం స్టార్ట్ చేస్తే పూజిస్తారు. భక్తులుగా మారి పోతారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఎంత అభిమానిస్తారో.. మహేంద్ర సింగ్ ధోనీని కూడా అంతే ప్రేమిస్తారు. అది కేవలం తమిళనాడులో మాత్రమే కాదు.. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా సీఎస్‌కే ఫ్యాన్స్ ఉంటారు. ఎక్కడికి వెళ్లినా వారుంటారు. చంద్రమండలం వెళ్లినా సీఎస్‌కే అభిమానులు ఉంటారు’ అని ఇర్ఫాన్ వ్యాఖ్యానించాడు.
Irfan Pathan said “If you are on the CSK side, you are loved by everyone, people in Tamil Nadu will take time to love you but once they love you, they will become your devotes, they love & adore MS Dhoni, if you go to moon as well, there will be CSK fans”. [Star Sports] pic.twitter.com/1hQFp4Lwhc
— Johns. (@CricCrazyJohns) May 29, 2023
వేలాదిగా అభిమానులు
డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ సొంత గ్రౌండ్ అయినా.. నరేంద్ర మోదీ స్టేడియం చుట్టూ పసుపు మయం అయింది. ఎంఎస్ ధోనీ ఆటను చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలి వచ్చారు. ఫైనల్ మ్యాచ్‌ను లక్ష మందికిపైగా అభిమానులు ప్రత్యక్షంగా చూస్తారని అంచనా వేస్తున్నారు. నేటి మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారబోదని వాతావరణ శాఖ పేర్కొనడంతో అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు.