Site icon Prime9

MI vs GT Qualifier 2 : నేడు క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో తలపడనున్న గుజరాత్ – ముంబై.. ఇంటికి ఎవరు ? ఫైనల్ కి ఎవరు ??

today MI vs GT Qualifier 2 match important points

today MI vs GT Qualifier 2 match important points

MI vs GT Qualifier 2 : ఐపీఎల్ 2023లో మరో రసవత్తర మ్యాచ్ కు రంగం సిద్దమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా క్వాలిఫయర్-2 మ్యాచ్‌ జరగనుంది. క్వాలిఫయర్-1లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైన గుజరాత్.. ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నోని చిత్తు చేసిన ముంబై ఈ మ్యాచ్ లో తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ మళ్ళీ మరోసారి కప్ కొట్టాలనే ఆశతో బరిలోకి దిగుతుండగా.. అనూహ్యంగా ప్లే ఆఫ్స్ చేరిన ముంబై ఈ మ్యాచ్‌లోనూ గెలిచి లీగ్ చరిత్రలో 7వ సారి ఫైనల్‌కు అర్హత సాధించాలని భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బలాబలాల పరంగా చూస్తే ఇరు జట్లు సమానంగా కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తుండగా.. ముంబై బ్యాటర్లు భారీ స్కోర్లు చేస్తున్నారు. దీంతో గుజరాత్ బౌలర్లు, ముంబై బ్యాటర్ల మధ్య ఆసక్తిపోరు జరగడం ఖాయం అనిపిస్తుంది. ముందుగా ముంబై టీమ్ బలం గురించి మాట్లాడితే.. సరైన సమయంలో టాప్‌ గేర్‌ వేసిన ముంబై.. మంచి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. అనూహ్య రీతిలో నాకౌట్‌కు చేరినా.. ఎలిమినేటర్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను చిత్తుచేసి ముంబై ఫామ్ లోకి వచ్చింది. ఇక టీమ్ బ్యాటర్లు గాడినపడడంతో ఆ జట్టు భారీ లక్ష్యాలను ఛేదిస్తోంది. టాపార్డర్‌లో రోహిత్‌, ఇషాన్‌ ఎఫెక్ట్ చూపకపోయినా.. మిడిలార్డర్‌లో గ్రీన్‌, సూర్యకుమార్‌, తిలక్‌ వర్మ, టిమ్‌ డేవిడ్‌ జట్టుకి వెన్నెముకగా నిలిచారు. నేహల్‌ వధేరా కూడా బాగా రాణిస్తున్నాడు. బౌలింగ్‌ విషయానికొస్తే బ్రుమా, ఆర్చర్‌ లేకపోయినా.. ఆకాష్‌ మధ్వాల్‌, సీనియర్‌ స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లా, బెహ్రెన్‌డార్ఫ్‌ అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా లక్నోతో ఎలిమినేటర్‌లోమధ్వాల్‌ 5 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

ఇక లీగ్‌ మ్యాచ్‌ల్లో అత్యధిక విజయాలతో టాప్‌లో నిలిచిన గుజరాత్‌.. క్వాలిఫయర్‌–1లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి ఊహించని షాక్ అనే చెప్పాలి. సొంతగడ్డపై మ్యాచ్ అంటే గుజరాత్ కి కలిసొచ్చే అంశం. బ్యాటింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోతున్నాడు. అలానే విజయ్‌ శంకర్‌, రషీద్ ఖాన్ కూడా రాణిస్తున్నా.. హార్దిక్‌ పాండ్యా, మిల్లర్‌, రాహుల్ తెవాటియా లాంటి హిట్టర్లు ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. వరుసగా రెండోసారి ఫైనల్‌ చేరాలంటే మాత్రం వీరి నుంచి జట్టు మెరుగైన ప్రదర్శనను ఆశిస్తోంది. బౌలింగ్‌లో షమి, రషీద్‌ మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నారు.

గుజరాత్ టైటాన్స్ (అంచనా)..

వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, హార్ధిక్ పాండ్య (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, దసున్ షనక, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, యశ్ దయాళ్, అల్జారీ జోసెఫ్/నూర్ అహ్మద్/జోష్ లిటిల్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ.

ముంబయి ఇండియన్స్ (అంచనా)..

రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పియూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ, జాసన్ బెరెన్ డార్ఫ్.

Exit mobile version