SRH vs RCB: క్లాసెన్ సూపర్ నాక్ ఆడాడు. లోన్ వారియర్ గా పోరాడిన క్లాసెన్ హైదరాబాద్ జట్టుకు ఓ క్లాసీ స్కోర్ అందించాడు. 49 బంతుల్లో 104 రన్స్ చేసి అతి తక్కువ బంతుల్లో సూపర్ సెంచరీ సాధించిన బ్యాటర్ల లిస్టులో చేరాడు. ఫస్ట్ హాఫ్ మ్యాచ్ ముగిసే సరికి నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 186 పరుగులు చేసింది. దానితో ఆర్సీబీ టార్గెట్ 187 పరుగులుగా ఉంది. ఆర్సీబీ బౌలర్లలో బ్రేస్ వేల్ 2 వికెట్లు తీయగా హర్షల్, శహ్ బాజ్, సిరాజ్ తలో వికెట్ తీశారు. మరి ఈ నిర్ణీత లక్ష్యాన్ని ఛేదించి ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంటుందా లేదా ఓడి ఇంటి బాట పడుతుందా అనేది సెకెండ్ ఇన్నింగ్స్ తో తేలిపోనుంది.
హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాప్ డెప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాగా ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ ఆర్‌సీబీకి చాలా కీలకం కానుంది. బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లో తప్పని సరిగా విజయం సాధించాల్సి ఉంది.