RCB vs CSK: ఐపీఎల్ సీజన్ 16 లో మరో ఆసక్తికర పోరు జరుగనుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొట్టనుంది. రెండు రోజుల క్రితం ఢిల్లీపై బెంగళూరు అద్భుత విజయం సాధించి ఊపు మీద ఉంది. మరోసారి తన సొంత గ్రౌండ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై పోరుకు సిద్ధమైంది. మరోవైపు గత మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో ఓటమి పాలైన సీఎస్కే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని చూస్తోంది.
ప్రతి మ్యాచ్ కీలకం(RCB vs CSK)
చివరి ఓవర్‌లో ధోనీ, జడేజా ఉన్న.. చెన్నై ఓటమిపాలైంది. అయితే, ఈసారి మాత్రం అలాంటి అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ప్రతి మ్యాచ్ ఫలితం కీలకం కాబట్టి ఆ దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది. టాప్ ఆర్డర్ రాణిస్తున్నా.. మిడిల్‌లో సరిగా ఆడకపోవడంతో చివర్లో వచ్చే బ్యాటర్లపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. అయితే బెంగళూరు బౌలర్లను ఎదుక్కోవాలంటే టాప్ ప్లేయర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడు ప్రదర్శించాలి. రాత్రి 7.30 గంటలకు ఆర్‌సీబీ , సీఎస్‌కే జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా ధోని
ఇక ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉండనున్నట్టు తెలుస్తోంది. మోకాలి గాయంతో బాధపడుతున్న ధోని కేవలం బ్యాటింగ్ మాత్రమే వస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ధోని ఇంపాక్ట్ ప్లేయర్ గ్ వస్తే.. కెప్టెన్‌గా ఆల్‌రౌడర్ రవీంద్ర జడేజా వ్యవహరిస్తాడని తెలుస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌కు సీఎస్‌కే ఆటగాళ్లు బెన్ స్టోక్స్, మగాల గాయం కారణంగా దూరంగా ఉండనున్నారు.
తుది జట్లు:
సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మతీష్ పతిరణ, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సింగ్
ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, వైషాక్ విజయ్‌కుమార్