PBKS vs LSG: ఐపీఎల్ 2023లో భాగంగా మొహాలీ వేదికగా లక్నో సూపర్ జెయింట్సో తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ బౌలింగ్లో చిత్తు చిత్తుగా విఫలమయ్యిందనే చెప్పాలి. పంజాబ్ బౌలర్లపై లక్నో బ్యాటర్లు విరుచుకుపడ్డారు. ఏ బౌల్ వేసినా కూడా దాన్ని బౌండరీగా మలచడంలో లక్నో బ్యాటర్లు విజయవంతం అయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 257 పరుగులు చేశారు. ఇది ఐపీఎల్ హిస్టరీలో సెకెండ్ హైయెస్ట్ స్కోర్ గా నిలిచింది. కాగా ఇప్పుడు పంజాబ్ లక్ష్యం 258.
ఈ సీజన్‌లో ఇరు జట్లు చెరో 7 మ్యాచులను ఆడగా రెండూ జట్లూ తలా నాలుగు మ్యాచుల్లో విజయాలు సాధించాయి.