MS Dhoni : మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్ 2023 టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి చెన్నై ఐదోసారి టైటిల్ గెలుచుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసిన తరువాత చెన్నై ఇన్నింగ్స్ ప్రారంభం కాగానే 3 బంతుల్లో 4 పరుగులు చేయగానే వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. వర్షం వెలిసిన తరువాత డక్‌వర్త్ లూయిస్ పద్దతి అనుసరించి 15 ఓవర్లకు చెన్నై లక్ష్యాన్ని 171 పరుగులుగా నిర్దేశించారు. ఆఖర్లో చెన్నై విజయానికి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరం కాగా.. రవీంద్ర జడేజా వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి గెలిపించాడు.
అయితే ముందు నుంచి ధోనీ రిటైర్మెంట్‌పై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇదే ధోనీకి చివరి సీజన్ అని వార్తలు పుట్టుకొస్తున్న తరుణంలో అభిమానులకు ఓ సూపర్ గుడ్ న్యూస్ చెప్పాడు ధోనీ. మ్యాచ్ అనంతరం తన రిటైర్మెంట్ గురించి ప్రశ్నించగా.. “ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే, నేను పదవీ విరమణ చేయడానికి ఇది సరైన సమయం. కానీ, చెన్నై అభిమానులు నాపై చూపించిన ప్రేమను తీరు, నేను మరో సీజన్ ఆడాలని కోరుకుంటున్నాను. వారికి ఇచ్చే బహుమతి ఇదే. వాళ్లు చూపించిన ప్రేమ, అభిమానం, నేను కూడా వాళ్ల కోసం ఏదైనా చేయాలి. రాబోయే తొమ్మిది నెలలు కష్టపడి తిరిగి ఒక సీజన్ ఆడటం కష్టం. అందుకు నా శరీరం సహకరించాలి. కానీ, అభిమానుల కోసం మరో సీజన్ ఆడతాను’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులంతా ఫుల్ ఖుషి అవుతున్నారు.
Thala happy and so are we ✨💥pic.twitter.com/WfT3VybSUt
— Chennai Super Kings (@ChennaiIPL) May 29, 2023
అదే విధంగా ఎప్పుడు కూల్ గా ఉండే ధోనీ (MS Dhoni).. ఈ మ్యాచ్ సక్సెస్ తర్వాత కొంచెం ఎమోషనల్ అయ్యాడు. జట్టు విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్ సంబురాలు స్టార్ట్ చేశారు. ఆ క్రమంలోనే అక్కడికి వచ్చిన జడేజాను.. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన భుజాలపైకి ఎత్తుకొని అభినందనలతో ముంచెత్తారు. ఆ సమయంలోనే భావోద్వేగానికి లోనైనట్లు కనబడ్డాడు. ధోనీ భుజాలపైకి ఎత్తుకున్న వీడియోను ఐపీఎల్ యాజమాన్యం అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోను చూసిన చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు అంతా ఒకింత ఎమోషనల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.
We are not crying, you are 🥹
The Legend continues to grow 🫡#TATAIPL | #Final | #CSKvGT | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/650x9lr2vH
— IndianPremierLeague (@IPL) May 30, 2023