MI vs CSK: ఐపీఎల్ 2023లో భాగంగా చెపాక్లో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీ నమోదు చేసింది. 140 పరుగు లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి హోం టైన్ క్రౌడ్ కి అద్భుతమైన ఆనందాన్ని మిగిల్చింది. 140 పరుగులను చెన్నై కేవలం 17.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 139 పరుగులు చేసింది. కాగా చెన్నై బౌలర్లు పతిరాణా మూడు వికెట్లు తీసి సూపర్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బౌలర్ గా నిరూపించుకున్నారు. చాహర్, దేశ్ పాండే చెరో రెండు వికెట్లు తీశారు. జడేజా, తీక్షణ, తుషార్, పతిరాణా, చాహర్ ఇలా బౌలర్లంతా ముంబై బ్యాటర్లను కట్టడి చేయడంలో విజయవంతం అయ్యారు.