LSG vs KKR : ఐపీఎల్ 2023 చివరి దశకు చేరుకుంటుంది. ఇప్పటికే గుజరాత్ ప్లే ఆఫ్స్ లో బెర్త్ ఓకే చేసుకోగా.. నిన్న జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ పై విజయం సాధించి చెన్నై కూడా ప్లే ఆఫ్స్ కు చేరింది. ఆ తర్వాత రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్స్ కి చేరుకొని.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలవడమే కాకుండా ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన మూడో జట్టుగా కూడా మారింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు మాత్రమే చేసింది. కోల్‌కతా బ్యాటర్లలో రింకూ సింగ్ (67 నాటౌట్; 33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో మ్యాచ్ చివరి వరకు పోరాడినా కోల్‌కతా టీమ్‌కి ఓటమి తప్పలేదు.
మ్యాచ్‌లో అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ నికోలస్ పూరన్ (58: 30 బంతుల్లో 4×4, 5×6) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. డికాక్ (28), ప్రీరాక్ మాన్కడ్ (26), ఆయుష్ బదోని (25) పర్వాలేదనిపించారు. స్టెయినిస్ (0) డకౌటవడం, కెప్టెన్ కృనాల్ పాండ్య (9) సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటైపోవడం ఫ్యాన్స్ ని బాగా నిరాశ పరిచింది. దీంతో లక్నో 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా లు తలా రెండు వికెట్లు తీయగా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిలు ఒక్కొ వికెట్ పడగొట్టారు. ఈ సీజన్ లీగ్ దశలో రెండు జట్లకీ ఇదే చివరి మ్యాచ్ కాగా.. 8వ ఓటమితో పట్టికలో 7వ స్థానంలో నిలిచిన కోల్‌కతా టోర్నీ నుంచి నిష్క్రమించింది. చూడాలి మరి బెంగుళూరు, ముంబై జట్లలో ఏ టీం ప్లే ఆఫ్స్ కి చేరుతుందో అని..