IPL 2023 SRH vs PBKS: హోమ్ గ్రౌండ్ లో మరో మ్యాచ్ ఆడుతుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ పంజాబ్ జట్లు ఎదురెదురు తలపడుతున్నాయి. కాగా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది సన్ రైజర్స్. బ్యాటింగ్ దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 143 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ థావన్ మాత్రమే క్రీజులో మొదటి నుంచి నిలబడి జట్టు స్కోరును 143 పరుగులకు చేర్చాడు. మిగిలిన వారంతా వచ్చినవారు వచ్చినట్టే పెవిలియన్ బాట పట్టారు. 15 ఓవర్లకే దాదాపు 9 వికెట్లు పడిపోగా సింగిల్ హ్యాండ్ మీద శిఖర్ జట్టును నడిపించాడు. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో 66 బంతులకు 99 పరుగులు చేసి నాట్ ఔట్ గా నిలిచాడు. కాగా హైదరాబాద్ జట్టు లక్ష్యం 144 పరుగులు.