IPL 2023 RR vs GT: ఐపీఎల్ 2023 లో జయపుర వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ 118 పరుగులకే ఆలౌట్ అయింది. తొలుత టాస్ నెగ్గిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే రాజస్థాన్ బ్యాటర్స్ ఎవరూ కూడా రాణించలేక పోయారు. కెప్టెన్ సంజూ శాంసన్ (30), చివర్లో ట్రెంట్ బౌల్ట్ (15) పర్వాలేదనిపించడంతో 100 పరుగులైనా దాటగలిగారు. దీంతో గుజరాత్ కు 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇచ్చారు. జయపుర స్టేడియంలో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, నూర్ అహ్మద్ 2, షమీ, హార్దిక్ పాండ్యా, లిటిల్ లు తలో వికెట్ తీసుకున్నారు.
🚨 Toss Update 🚨@rajasthanroyals have elected to bat against @gujarat_titans.
Follow the match ▶️ https://t.co/tilu6n2vD3#TATAIPL | #RRvGT pic.twitter.com/hN22QKH8ly
— IndianPremierLeague (@IPL) May 5, 2023
తుది జట్లు( IPL 2023 RR vs GT)
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవ్‌దత్ పడిక్కల్, సంజూ శాంసన్ ( కెఫ్టెన్, వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్‌మైర్, దృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, ఆడమ్ జంపా, చహల్
సబ్ స్టిట్యూట్లు: మురుగన్ అశ్విన్, కుల్దిప్ యాదవ్, కేఎం అసిఫ్, జో రూట్ , రియాన్ పరాగ్
గుజరాత్ టైటాన్స్: హార్ధిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, జాషువ లిటిల్, మోహిత్ శర్మ
సబ్ స్టిట్యూట్లు: శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్, రవి శ్రీనివాసన్ సాయి కిశోర్, శివమ్ మావి