Site icon Prime9

IPL 2023 LSG vs SRH: హైదరాబాద్ జట్టును మట్టికరిపించిన లక్నో టీం

IPL 2023 LSG vs SRH

IPL 2023 LSG vs SRH

IPL 2023 LSG vs SRH: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా లక్కో వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సేన 5 వికెట్ల తేడాతో సునాయసంగా ఆరెంజ్ ఆర్మీని మట్టికరిపించాయి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 అతి తక్కువ పరుగులు చేసింది.

హైదరాబాద్ జట్టును కట్టడి చెయ్యడంలో లక్నో బౌలర్లు విజయం సాధించారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కృనాల్ పాండ్యా ముఖ్య పాత్ర పోషించాడనే చెప్పాలి. ఆరెంజ్ ఆర్మీ కీలక మూడు వికెట్లను కృనాల్ దక్కించుకున్నాడు. అలాగే అమిత్ మిశ్రా 2 వికెట్లు పడగొట్టగా.. యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక హైదరాబాద్ తరఫున రాహుల్ త్రిపాఠి 41 బంతుల్లో 35, అన్మోల్‌ప్రీత్ సింగ్ 26 బంతుల్లో 31 పరుగులు చేసి కొంత మేరకు జట్టు స్కోరు తోడ్పడ్డారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన అబ్దుల్ సమద్(21), వాషింగ్టన్ సుందర్ (16) పరుగుల చేసి వెనుదిరిగారు.

ఇక లక్నో టీమ్ ఆరెంజ్ ఆర్మీ తమ ముందుంచిన 122 పరుగుల స్వల్వ లక్ష్యాన్ని 4 ఓవర్లు మిగిలి ఉండగానే సునాయాసంగా చేధించింది. ఈ క్రమంలో లక్కో తరఫున బరిలోకి దిగిన కెప్టెన్ రాహుల్ 31 బంతుల్లో 35, కృనాల్ పాండ్యా 23 బంతుల్లో 34 పరుగులతో రాణించారు. దీంతో లక్నో విజయం దాదాపు ఖరారైంది. దీనితో హైదరాబాద్ ఈ 16 సీజన్లో తన రెండో మ్యాచ్‌ని కూడా ఓడినట్లయింది. హోంగ్రౌండ్లో ఆడిన తొలి మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో హైదరబాద్ పరాజయం పాలవగా ఇప్పుడు లక్నోచేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఇదిలా ఉంటే లక్నో వరుసగా తమ రెండో విజయాన్ని అందుకుంది. అంతకముందు ఢిల్లీ క్యాపిటల్స్‌పై 50 రన్స్ తేడాతో గెలుపొందిన లక్నో తాజాగా హైదరాబాద్‌పై గెలిచి మరోసారి విజయ పతాకాన్ని ఎగరవేసింది. ఇక ఈ సీజన్ లో మూడు మ్యాచులు ఆడిన లక్నో టీమ్ రెండు విజయాలు సాధించింది. అలాగే పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నిలిచింది.

Exit mobile version