IPL 2023 KKR vs GT: ఐపీఎల్ 2023 సీజన్ 16లో భాగంగా గుజరాత్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్లో రింకూ రెచ్చిపోయి ఆడాడు. ఆఖరి ఓవర్లో సిక్స్ ల మోత మోగించి కేకేఆర్ విజయానికి నాంది పలికాడు.
ఆఖరి ఓవర్లో రింకూ రెచ్చిపోయి ఆడాడు. సిక్స్ ల మోత మోగించి కేకేఆర్ విజయానికి నాంది పలికాడు.
వరుస వికెట్లు కోల్పోతున్న కేకేఆర్. వచ్చీరాగానే సునీల్ నరైన్ వెనువెంటనే శార్దూల్ ఠాకూర్ ఔట్ అయ్యారు. ప్రస్తుతం కేకేఆర్ స్కోర్ 155/7.
వచ్చీ రాగానే వెనుదిరిగిన రసెల్. 6 బాల్స్ లో 3 పరుగులు చేసి రసెల్ ఔట్ అయ్యాడు
40బంతుల్లో 80 పరుగులు చేసిన వెంకటేష్ అయ్యర్ జోసెఫ్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. దానితో కేకేఆర్ దూకుడుకి బ్రేక్ పడింది. ప్రస్తుతం క్రీజులో రసెల్, రింకూ ఉన్నారు.
15 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ స్కోర్ 149/3. ప్రస్తుతం క్రీజులో రింకూ, వెంకటేష్ అయ్యర్ ఉన్నారు.
హాఫ్ సెంచరీకి అడుగు దూరంలో నితీష్ రాణా పెవిలియన్ చేరాడు. 29 బాల్స్ లో 45 పరుగులు తీసి నితీష్ రాణా ఔట్ అయ్యారు. ప్రస్తుతం కేకేఆర్ స్కోర్ 128/3. క్రీజులో రింకూ, వెంకటేష్ అయ్యర్ ఉన్నారు.
వెంకటేష్ అయ్యర్ 26 బంతుల్లో 51 పరుగులు చేశారు. ప్రస్తుతం కేకేఆర్ స్కోర్ 103/2
10 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ స్కోర్ 86/2. ప్రస్తుతం క్రీజులో వెంకటేశ్, నితీష్ ఉన్నారు.
జగదీశన్ 8 బంతుల్లో 6 రన్స్ చేసి ఓట్ అయ్యారు. ప్రస్తుతం కేకేఆర్ స్కోర్ 28/2.
ఫస్ట్ వికెట్ కోల్పోయిన కోలకతా. గుర్బాజ్ 12 బంతుల్లో 15 పరుగులు చేసి ఔట్ అయ్యారు.
205 లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కేకేఆర్. ఓపెనర్లుగా గుర్బాజ్, జగదీశన్.
ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ స్కోర్ 204. లాస్ట్ ఓవర్లో వరుస సిక్స్ లతో చెలరేగిన శంకర్
22 బాల్స్ లో విజయ శంకర్ హాఫ్ సెంచరీ పూర్తి చేశారు.
38 బంతుల్లో 53 పరుగులు చేసి సాయి సుదర్శన్ ఔట్ అయ్యారు. ప్రస్తుతం గుజరాత్ స్కోర్ 153/4. క్రీజులో డి మిల్లర్, శంకర్ ఉన్నారు.
సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. 34 బాల్స్ లో 50 పరుగులు చేశారు. 16.2 ఓవర్లు ముగిసే సరికి ప్రస్తుతం గుజరాత్ స్కోర్ 147/3.
15 ఓవర్లు ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ స్కోర్ 132/2. ప్రస్తుతం క్రీజులో సుదర్శన్, శంకర్ ఉన్నారు.
సుయాష్ బౌలింగ్లో 8 బంతుల్లో 13 పరుగులు చేసి అభినవ్ ఔట్ అయ్యాడు.
నరైన్ బౌలింగ్లో 31 బాల్స్ లో 39 పరుగులు చేసి శుభ్ మన్ గిల్ ఔట్ అయ్యారు. ప్రస్తుతం గుజరాత్ స్కోర్ 100/2. క్రీజులో అభినవ్ మనోహర్, సుదర్శన్ ఉన్నారు.
10 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ స్కోర్ 88/1. ప్రస్తుతం క్రీజులో సుదర్శన్, శుభ మన్ గిల్ ఉన్నారు. వీరిద్దరి భాగస్వామ్యంతో 50 పరుగులుపైగా వచ్చాయి.
పవర్ ప్లే ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ స్కోర్ 54/1. క్రీజులో సుదర్శన్, శుబ్ మన్ గిల్ ఉన్నారు.
మొదటి వికెట్ కోల్పోయిన గుజరాత్ టైటాన్స్. వృద్దిమాన్ సాహో 17 బాల్స్ కు 17 పరుగులుచేసి పెవిలియన్ బాట పట్టాడు. 5 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ 38/1. ప్రస్తుతం క్రీజులో గిల్, సుదర్శన్ ఉన్నారు
టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్. హార్దిక్ పాండ్యా స్థానంలో స్టాండిన్ కెప్టెన్ గా రషీద్ ఖాన్ వ్యవహరిస్తున్నాడు.