Site icon Prime9

IPL 2023: ఐపీఎల్ జట్లు వదిలించుకున్న ఆటగాళ్ల లిస్ట్ ఇదే..!

ipl-2023-all-teams-released-players-list

ipl-2023-all-teams-released-players-list

IPL 2023: ఐపీఎల్ 2023 ట్రేడింగ్ విండో మంగళవారంతో ముగిసిపోయింది. మినీ ఆక్షన్‌ కు కీలకమైన ప్రక్రియ పూర్తయింది. దేశంలోని 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆటగాళ్ల లిస్ట్ ను విడుదల చేశాయి. ఇక వేలంలో ఎవరుంటారనేది తేలిపోయింది. వేలంలో ఎవరిని ఎంతపెట్టి ఏ జట్టు కొనుగోలు చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.

బీసీసీఐ (BCCI) ఇచ్చిన గడువు నవంబర్ 15 సాయంత్రం 5 గంటలతో ముగియడంతో 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రిలీజ్ జాబితాలను వెల్లడించాయి. అత్యధికంగా కేకేఆర్ 16, ముంబై ఇండియన్స్ 13 మంది ఆటగాళ్లను వేలంలోకి వదిలేశాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. ఇకపోతే డిసెంబర్ 23న కేరళలోని కొచ్చి వేదికగా ఐపీఎల్ 2023 మినీ వేలం జరగనున్నట్టు సమాచారం. మరి ఐపీఎల్ ఫ్రాంచైజీలు వేలంలోకి వదిలిన ఆటగాళ్లు ఎవరో చూసేద్దామా.

ముంబై రిలీజ్ లిస్ట్: ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ ఐపీఎల్ కు గుడ్ బై చెప్పడం పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. అన్మోల్‌ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్

చెన్నై సూపర్ కింగ్స్ : డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిశాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కెఎం ఆసిఫ్, నారాయణ్ జగదీశన్.

ఆర్సీబీ: జాసన్ బెహ్రెండార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చామా మిలింద్, లువ్నిత్ సిసోడియా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్

సన్‌రైజర్స్: కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద

కేకేఆర్‌ : పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమర్, అజింక్య రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, ప్రథమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్

పంజాబ్‌: మయాంక్ అగర్వాల్, ఒడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, రిటిక్ ఛటర్జీ

రాజస్తాన్‌ : అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, శుభమ్ గర్వాల్, తేజస్ బరోకా

గుజరాత్ టైటాన్స్: లాకీ ఫెర్గూసన్, డొమినిక్ డ్రేక్స్, రహ్మానుల్లా గుర్బాజ్, గురుకీరత్ సింగ్, జాసన్ రాయ్, వరుణ్ ఆరోన్

ఢిల్లీ: శార్దూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, అశ్విన్ హెబ్బార్, కేఎస్ భరత్, మన్‌దీప్ సింగ్

లక్నో: ఆండ్రూ టై, అంకిత్ రాజ్‌పూత్, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే, షాబాజ్ నదీమ్

ఇదీ చదవండి: “ఐపీఎల్ కు గుడ్ బై” చెప్పిన పోలార్డ్

Exit mobile version