Site icon Prime9

CSK vs GT Qualifier 1 : గుజరాత్ ని మట్టి కరిపించిన చెన్నై.. ఫైనల్స్ లోకి సూపర్ కింగ్స్

CSK vs GT Qualifier 1 match highlights in ipl 2023

CSK vs GT Qualifier 1 match highlights in ipl 2023

CSK vs GT Qualifier 1 : ఐపీఎల్ 2023 ముగియడానికి మరో మూడు మ్యాచ్ ల దూరం లోకి వచ్చేసింది. కాగా ఈ మేరకు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన క్వాలిఫయర్ -1  మ్యాచ్‌లో చెన్నై, గుజరాత్ టీమ్ లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో గుజరాత్ జట్టుని మట్టి కరిపించి చెన్నై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.  దాంతో  చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 14 సీజన్ లలో 10 వ సారి ఫైనల్‌కి అర్హత సాధించింది. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై టీమ్ 172 పరుగులు చేయగా.. టార్గెట్ ని ఛేదించే క్రమంలో గుజరాత్ టీమ్ 157 పరుగులకి ఆలౌటైంది. ఐపీఎల్‌లో గుజరాత్ టీమ్‌ని చెన్నై ఓడించడం ఇదే తొలిసారి కాగా.. గతంలో మూడుసార్లు గుజరాత్ చేతిలో ఓటమి పాలయ్యింది. దాంతో హోమ్ గ్రౌండ్ వేదికగా చెపాక్‌లో ఆ జట్టు ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓడినప్పటికీ ఫైనల్‌కి చేరేందుకు ఆ జట్టుకి క్వాలిఫయర్ -2 ( ఈ నెల 26) మ్యాచ్‌‌ ద్వారా ఛాన్స్ ఉంది చెప్పవచ్చు.

173 పరుగుల టార్గెట్ ని చేధించడానికి బరిలోకి దిగిన గుజరాత్.. ఆరంభం నుంచే వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ సాహా (12) తక్కువ స్కోర్ కే వెనుదిరిగినా.. ఫామ్‌లో ఉన్న మరో ఓపెనర్ శుభమన్ గిల్ (42: 38 బంతుల్లో 4×4, 1×6) నిలకడగా ఆడుతూ గుజరాత్ స్కోరు బోర్డుని ముందుకు నడిపించాడు. కానీ మిగితా బియాత్రలు అంతా వరుసగా పెవిలియన్ బాట పట్టడంతో అతనికి సపోర్ట్ లభించలేదు. సాహ ఔట్ అయిన తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ లలో కెప్టెన్ హార్దిక్ పాండ్య (8), దసున్ శనక (17), డేవిడ్ మిల్లర్ (4) రాహుల్ తెవాటియా (3) తక్కువ స్కోరుకే ఔటైపోయారు. ముఖ్యంగా పాండ్య, తివాటియా కీలక మ్యాచ్ లో తీవ్రంగా నిరాశ పరిచారు. విజయ్ శంకర్ (14) కాస్త పరవాలేదు అనిపించుకుంటున్న తరుణంలో ఔట్ అవ్వడం.. చివర్లో రషీద్ ఖాన్ (30: 16 బంతుల్లో 3×4, 2×6) మెరుపులు మెరిపించినా కానీ మ్యాచ్ కీలక దశలో ఉన్నప్పుడు వీరిద్దరూ ఔట్ అవ్వడం గుజరాత్ ఓటమిని ఖాయం చేసింది. మొత్తానికి 20 ఓవర్లలో గుజరాత్ 157 పరుగులకి గుజరాత్ ఆలౌటైంది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, థీక్షణ, జడేజా, పతిరన రెండేసి వికెట్లు, తుషార్ దేశ్‌పాండే ఒక వికెట్ తీశారు.

అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై టీమ్ 7 వికెట్లు కోల్పోయి 172 రన్స్ చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (60: 44 బంతుల్లో 7×4, 1×6) అర్ధ సెంచరీతో చెలరేగగా.. దేవాన్ కాన్వె (40: 30 బంతుల్లో 4×4) పర్వాలేదనిపించాడు. వీరిద్దరూ కలిసి జట్టుకి రికార్డు స్థాయిలో ఓపెనింగ్ పార్ట్ నర్ షిప్ ఇచ్చారు. కానీ వారు వికెట్లు కోల్పోయిన తర్వాత శివమ్ దూబె (1), రహానె (17), రాయుడు (17), జడేజా (22), ధోనీ (1) ఈ మ్యాచ్ లో విఫలం అయ్యారు. ముఖ్యంగా ధోనీ మళ్ళీ రెండు, మూడు సిక్స్ లు అయినా కొడతాడు అనుకున్న ఫ్యాన్స్ అందరికీ ధోనీ షాక్ ఇచ్చి ఔట్ అయ్యాడు. చివ‌ర్లో ర‌వీంద్ర జ‌డేజా(22; 16 బంతుల్లో 2 ఫోర్లు) రాణించడంతో చెన్నై మంచి స్కోర్ చేయగలిగింది. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో మోహిత్ శ‌ర్మ, మ‌హ్మ‌ద్ ష‌మీ చెరో రెండు వికెట్లు తీయ‌గా దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్, ర‌షీద్ ఖాన్ లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

Exit mobile version