CSK vs DC: ఐపీఎల్ అంటేనే ఆ మజా వేరబ్బా. అందులోనూ తమ ఫేవర్ టీం మ్యాచ్ అంటే క్రికెట్ ప్రియులు ఎంత ఆత్రుతతో వేచి చూస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంలాటిది ఇక క్రికెట్ చరిత్రలో ధోనీకి ఉన్న క్రేజ్ వేరే లెవల్. సీఎస్కే మ్యాచ్ అందులోనూ హోంగ్రౌడ్లో ధోనీసేన మ్యాచ్ అంటే ఏ రేంజ్లో ఉంటుందో మీరే ఊహించకోండి ఓ సారి. మైదానమంతా పసుపు పూసుకున్నట్టు జనసంద్రంతో కిక్కిరిసిపోతుంది. కాగా ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది.
చెన్నై ఘన విజయం(CSK vs DC)
168 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. దానితో ధోనీసేన 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో రిలీ రోసో(35), మనీష్ పాండే(27), అక్షర్ పటేల్(21) తప్ప ఎవరూ రెండంకెల స్కోర్ చెయ్యలేకపోయారు. క్రీజులో నిలబడలేకపోయారు. ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్(0), మిచెల్ మార్ష్(5), సాల్ట్(17)లు సహా బ్యాటర్లంతా విఫలం అయ్యారని చెప్పవచ్చు. చెన్నై బౌలర్ల ధాటికి ఢిల్లీ నిలిబడలేకపోయింది. ఇక చెన్నై బౌలర్ల మతీషా పతిరణ మూడు వికెట్లు పడగొట్టగా దీపక్ చాహర్ రెండు, రవీంద్ర జడేజా ఓ వికెట్ తీశారు.
అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో దూబే(25) హైయెస్ట్ స్కోర్. ఎవరూ కూడా అర్థశతకం నమోదు చెయ్యలేదు. రుతురాత్(24), రహానే(21), రాయుడు(23), జడేజా(21)ల నుంచి మంచి ఆరంభాలు లభించినా కానీ భారీ స్కోర్లు రాలేదు. ఇన్నింగ్స్ ఆఖర్లో ఎంట్రీ ఇచ్చిన తలా ధోని 9 బంతుల్లో 1ఫోర్, 2 సిక్స్‌లు బాది 20పరుగలతో తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ మూడు వికెట్లు పడగొట్టగా, అక్షర్ పటేల్ రెండు, ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌లు ఒక్కొ వికెట్ పడగొట్టారు.