Site icon Prime9

IPL 2023 SRH vs DC: టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

IPL 2023 SRH vs DC

IPL 2023 SRH vs DC

IPL 2023 SRH vs DC: ఐపీఎల్‌ 16 సీజన్ లో గత మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి చవి చూసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో కీలక పోరుకు సిద్దమైంది. ఉప్పల్‌ వేదికగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఎస్ఆర్ హెచ్ ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని ఆరెంజ్‌ ఆర్మీ భావిస్తోంది.

 

తొలుత ఢిల్లీ బ్యాటింగ్(IPL 2023 SRH vs DC)

కాగా, ఉప్పల్ వేదికగా మరికాసేపట్లో మ్యాచ్ మొదలు కానుంది. దీంతో టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఢిల్లీ ఒకే ఒక గెలుపును నమోదు చేసుకుని పాయింట్స్ టేబుల్ లో అట్టడుగున ఉంది. ఇరు జట్టు ఆరు మ్యాచులు ఆడగా.. సన్ రైజర్స్ రెండు, ఢిల్లీ ఒక విజయాన్ని మాత్రమే అందుకున్నాయి. మరి ఈరోజు మ్యాచ్లో ఎవరు సత్తా చాటుతారో చూడాలి. కాగా, ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. జట్టులోకి రిపాల్ పటేల్, సర్పరాజ్ ఖాన్ కు చోటు దక్కింది. అదే విధంగా ఎస్ఆర్ హెచ్ జట్టులోకి టి నటరాజన్ కు వచ్చాడు.

 

 

తుది జట్లు

ఎస్‌ఆర్‌హెచ్‌: అభిషేక్ శర్మ, హ్యారీ బ్రూక్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్‌), మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌ కీపర్‌), మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

ఇంపాక్ట్ ప్లేయర్లు : నితీష్ రెడ్డి, వివ్రాంత్ శర్మ, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ దాగర్, రాహుల్ త్రిపాఠి

ఢిల్లీ క్యాపిటల్స్ : డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), ఫిలిప్ సాల్ట్ (వికెట్‌ కీపర్‌), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, రిపాల్ పటేల్, అన్రిచ్ నార్ట్జే కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ

ఇంపాక్ట్ ప్లేయర్లు: ముఖేష్ కుమార్, లలిత్ యాదవ్, ప్రవీణ్ దూబే, చేతన్ సకారియా, యశ్ ధుల్

 

Exit mobile version