Ind vs Nz 2nd ODI: రెండో వన్డేలో ఇండియా బౌలర్లు అరదగొట్టారు. భారత బౌలర్ల ధాటికి కివీస్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు.
బౌలర్ల ధాటికి 108 పరుగులకే కివీస్ చాప చుట్టేసింది. భారత్ లక్ష్యం 109 పరుగులు.
భారత్ – న్యూజిలాండ్ రెండో వన్డే నేడు జరుగుతుంది. మెుదటి ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. ఇక రెండో వన్డేలో ఇండియా టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకుంది.
సిరీస్ ను సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. అనుకున్నట్లు గానే.. తొలి ఓవర్లోనే కివీస్ వికెట్ పడింది.
తొలి ఓవర్ ఐదో బంతికి మహమ్మద్ షమి కివీస్ బ్యాట్స్ మెన్ ఫిన్ అలెన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది.
సిరాజ్ బౌలింగ్ లో హెన్రీ నికోల్స్ రెండో వికెట్ గా వెనుదిరిగాడు. దీంతో కివీస్ రెండో వికెట్ కోల్పోయింది.
షమీ బౌలింగ్ లో నిప్పులు చెరుగుతున్నాడు. కివిస్ బ్యాట్స్ మెన్ మిచెల్ జౌట్ చేశాడు.
దీంతో కివిస్ మూడో వికెట్ కోల్పోయింది.
హర్దిక్ పాండ్యా బౌలింగ్ లో డెవాన్ కాన్వే ఔట్.. దీంతో నాలుగో వికెట్ కోల్పోయిన కివీస్.
శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ లో కివీస్ బ్యాట్స్ మెన్ టామ్ లాథమ్ ఔటయ్యాడు.
దీంతో న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది.
షమీ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి బ్రాస్ వెల్ వెనుదిరిగాడు.
బ్రాస్ వేల్ ఔట్ అవ్వడంతో.. కివీస్ ఆరో వికెట్ కోల్పోయింది.
బౌలింగ్ లో షమీ దుమ్ము రేపుతున్నాడు. ఈ మ్యాచ్ లో ఇప్పటి వరకు మూడు వికెట్లు పడగొట్టాడు.
భారత బౌలర్ద ధాటికి న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ చెతులెత్తేశారు.
105 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్
విజయం సాధిస్తే విజయం మనదే..
నేడు Ind vs Nz న్యూజిలాండ్ తో భారత్ రెండో వన్డే.
రాయ్ పూర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే.
మెుదటి వన్డేలో విజయం సాధించిన ఇండియా.
రెండో మ్యాచ్ గెలిచేందుకు స్కెచ్ వేసిన ఇండియా.
ఇండియా ఈ మ్యాచులో గెలుస్తుందని అభిమానుల నమ్మకం.
మరోసారి శుభ్ మన గిల్ చెలరేగుతాడని అభిమానుల ఆసక్తి.
India: శుభమన్ గిల్, రోహిత్ శర్మ (సి), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ , సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
Nz : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ/డౌగ్ బ్రేస్‌వెల్, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/