Site icon Prime9

Harry Brook: ‘నువ్వు మారవా..’ అన్నవాళ్లకు బ్రూక్ సమాధానమిదే

Harry Brook

Harry Brook

Harry Brook: ‘నీవు మారవా.. 13 కోట్లు తీసుకున్నావు.. ఇదేనా నీ ఆటతీరు’, ‘టెస్టులాడే ఆటగాడిని తీసుకొచ్చి ఐపీఎల్ ఆడిస్తున్నారు’, ‘సన్ రైజర్స్ ఇలాంటి వారిని ఎందుకు కొన్దో అర్థం కాదు’.. ఇవి సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హ్యారీ బ్రూక్ పై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్. మినీ వేలంలో హ్యారీ బ్రూక్ ను సన్ రైజర్స్ రూ. 13.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇంత భారీ మొత్తం తీసుకుని మరి దారుణంగా విఫలమవుతున్న బ్రూక్ నను నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేశారు.

ఎందుకంటే బ్రూక్ ఆడిన మొదటి 3 మ్యాచుల్లో అతడి చేసిన పరుగులు కేవలం 29 పరుగులు మాత్రమే. దీంతో బ్రూక్ పై సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ పెట్టారు. కానీ సన్ రైజర్స్ మాత్రం అతడి ఆటపై నమ్మకాన్ని పెట్టింది. దాని ఫలితమే ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోలకతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో బ్రూక్.. తన బ్యాట్ తో ట్రోలర్స్ కు సమాధానం ఇచ్చాడు. చెలరేగి ఆడిన అతడు ఐపీఎల్ 2023 సీజన్ లో తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు.

కేకేఆర్ తో జరిగిన మొదటి నుంచే బ్రూక్ దూకుడుగా ఆడాడు. మొత్తంగా 55 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 100 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తద్వారా ఐపీఎల్‌ 16 వ సీజన్‌లో ఫస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. అంతే కాకుండా మరిన్ని అరుదైన రికార్డులను తన పేరుతో నమోదు చేసుకున్నాడు.

 

 

బ్రూక్‌ రికార్డులివే..(Harry Brook)

ఐపీఎల్‌లో శతకం సాధించిన ఐదో ఇంగ్లీష్‌ బ్యాటర్‌గా బ్రూక్‌ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు సాధించిన జాబితాలో ఇంగ్లండ్‌ క్రికెటర్లు కెవిన్ పీటర్సన్, బెన్ స్టోక్స్, జోస్‌ బట్లర్‌, జానీ బెయిర్‌ స్టో ఉన్నారు. ఇందులో బట్లర్‌ ఎక్కువగా 5 సెంచరీలు చేశాడు.

ఐపీఎల్‌లో సెంచరీ చేసిన మూడో సన్ రైజర్స్ బ్యాటర్‌గా బ్రూక్‌ నిలిచాడు. ఈ ఫీట్‌ సాధించిన లిస్ట్ లో డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌ స్టో ఉన్నారు. అదే విధంగా సొంత మైదానం (ఉప్పల్ , రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం)లో కాకుండా బయట గ్రౌండ్ లో సెంచరీ సాధించిన మొదటి ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాడిగా బ్రూక్ చరిత్ర సృష్టించాడు. వార్నర్‌, బెయిర్‌ స్టో లు మాత్రం హైదరాబాద్‌లోనే సెంచరీలు చేశారు.

ఈడెన్ లో పరుగుల వరద

కాగా, కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ తో సన్ రైజర్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. 23 పరుగుల తేడాతో సన్ రైజర్స్ గెలిచింది. 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులకే చేసింది. కేకేఆర్‌ కెప్టెన్‌ నితిన్ రాణా(71), రింకూ సింగ్‌ పోరాడనప్పటికీ తమ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన స్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసిం‍ది.

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పరుగుల వరద పారింది. ఇరుజట్లు 200 పైగా స్కోర్లు చేశాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పరుగుల వరద పారింది. రెండు జట్లు.. 200పైగా స్కోర్లు చేశాయి. మెుత్తంగా 433 పరుగులు వచ్చాయి. ఇందులో 22 సిక్సర్లు, 39 ఫోర్లు ఉండగా.. ఓ సెంచరీ.. మూడు అర్ధశతకాలు నమోదయ్యాయి. మెుదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్.. 20 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హ్యారీ బ్రూక్‌ సెంచరీతో చెలరేగాడు. 55 బంతుల్లో 100 పరుగులు చేశాడు. మార్‌క్రమ్‌ 50 పరుగులు.. అభిషేక్‌ శర్మ 32పరుగులతో రాణించారు. కోల్‌కతా బౌలర్లలో రసెల్‌ (3/22) ఒక్కడే ఆకట్టుకున్నాడు.

 

Exit mobile version