Site icon Prime9

Gujarat Titans: థ్రిల్లింగ్ మ్యాచ్.. ఊహించని మలుపులో గుజరాత్ గెలుపు

gujarat titans

gujarat titans

Gujarat Titans: గెలవాల్సిన మ్యాచ్ ను లక్నో సూపర్ జెయింట్స్ చేజేతులా పోగొట్టుకుంది. పవర్ ప్లే లో మంచి ఆరంభమే లభించిన.. దానిని ఉపయోగించుకోలేకపోయింది లక్నో. నెమ్మదిగా బ్యాటింగ్ చేయడమే రాహుల్ సేన కొంపముంచింది.

థ్రిల్లింగ్ మ్యాచ్.. (Gujarat Titans)

గెలవాల్సిన మ్యాచ్ ను లక్నో సూపర్ జెయింట్స్ చేజేతులా పోగొట్టుకుంది. పవర్ ప్లే లో మంచి ఆరంభమే లభించిన.. దానిని ఉపయోగించుకోలేకపోయింది లక్నో. నెమ్మదిగా బ్యాటింగ్ చేయడమే రాహుల్ సేన కొంపముంచింది.

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. 14 ఓవర్ల వరకు లక్నో వైపే మ్యాచ్‌ ఉండగా.. ఆఖరి ఐదు ఓవర్లలో ఊహించని మలుపు తిరిగింది. 14 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 106 పరుగులతో పటిష్టంగా కనిపించిన లక్నో సూపర్‌జెయింట్స్‌ మిగతా ఆరు ఓవర్లలో 22 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేసింది. ఓడుతుందనుకున్న గుజరాత్‌ ఏడు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించిది.

రాహులే కారణమా?

లక్నో ఓటమికి ప్రధానంగా రాహులే కారణమని సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో రాహుల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు.

కానీ అదే మ్యాచ్ ఓటమికి కారణమైంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. 35 బంతుల్లో 30 పరుగులు చేస్తే చాలు.

కానీ చేజింగ్‌ చేస్తున్న జట్టులో ఓ ఆటగాడు హాఫ్‌ సెంచరీతో ఆఖరి వరకు నిలిచాడంటే మ్యాచ్‌ను గెలిపిస్తాడని అంతా అనుకుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది.

చివరి వరకు క్రీజులో నిలిచిన రాహుల్.. చివరి ఓవర్‌ రెండో బంతికి ఔటయ్యాడు.

ఈజీగా గెలిపించాల్సిన మ్యాచ్‌ను ఎక్కడలేని ఒత్తిడిని నెత్తిమీద వేసుకొని మరి దగ్గరుండి లక్నోను ఓడగొట్టాడు.

మరో విచిత్రమేంటంటే.. 38 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ అందుకున్న రాహుల్‌.. తర్వాత 18 పరుగులకు 23 బంతులు తీసుకోవడం చూస్తే అతను ఎంత చెత్తగా ఆడాడో అర్థమవుతుంది.

అందుకే కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ను ట్రోల్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో అభిమానులు పెట్టిన మీమ్స్‌ వైరల్‌గా మారాయి.

ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో 60 బంతులెదుర్కొని అత్యంత చెత్త స్ట్రైక్‌రేట్‌ నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్‌ రాహుల్‌ నిలిచాడు.

తాజాగా గుజరాత్‌తో మ్యాచ్‌లో 61 బంతుల్లో 68 పరుగులు చేసిన రాహుల్‌ స్ట్రైక్‌రేట్‌ 111.48గా ఉంది. ఈ జాబితాలో కేఎల్‌ రాహుల్‌ మూడో స్థానంలో ఉన్నాడు.

ఇక తొలి స్థానంలో జేపీ డుమిని 59 పరుగులు(63 బంతులు), 93.65 స్ట్రై్‌రేట్‌, రెండో స్థానంలో ఆరోన్‌ ఫించ్‌ 62 బంతుల్లో 68 పరుగులు, 109.68 స్ట్రైక్‌రేట్‌ ఉ‍న్నాడు.

 

Exit mobile version