GT vs LSG: లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారీ విజయాన్ని అందుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. సాహా, గిల్ విధ్వంసంతో భారీ స్కోర్ సాధించిన గుజరాత్.. ఆ తర్వాత బౌలింగ్ లోను అదరగొట్టింది.
లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారీ విజయాన్ని అందుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. సాహా, గిల్ విధ్వంసంతో భారీ స్కోర్ సాధించిన గుజరాత్.. ఆ తర్వాత బౌలింగ్ లోను అదరగొట్టింది.
గుజరాత్ పాయింట్ల పట్టికలో దూసుకుపోతుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణిస్తూ.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టుపై అదరగొట్టింది. ఈ మ్యాచ్ లో 56 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
గుజరాత్ నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 171 పరుగులే చేసింది.
మెుదట టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన గుజరాత్.. భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది.
వృద్ధిమాన్ సాహా (81; 43 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (94; 51 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించారు.
హార్దిక్ పాండ్య (25; 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), డేవిడ్ మిల్లర్ (21; 12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడారు.
లఖ్‌నవూ బౌలర్లలో మోహ్‌సిన్ ఖాన్, అవేశ్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఒకానొక దశలో గుజరాత్ స్కోరు సులువుగా 250 దాటేలా కనిపించింది.
చివరి ఐదు ఓవర్లలో లఖ్‌నవూ బౌలర్లు కాస్త పొదుపుగా చేయడంతో 230 లోపే పరిమితమైంది.
లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన లక్నో ఆరంభంలో ధాటిగా ఆడిన ఆ తర్వాత చేతులెత్తేసింది.
ఓపెనర్లు క్వింటన్ డికాక్ (70; 41 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), కైల్ మేయర్స్ (48; 32 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా మిగతా బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయలేదు.
దీపక్ హుడా (11), స్టాయినిస్ (4), నికోలస్ పూరన్ (3), కృనాల్ పాండ్య(0) ఘోరంగా విఫలమయ్యారు. ఆయుష్ బదోని (21) పరుగులు చేశాడు.
గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ నాలుగు, నూర్ అహ్మద్, షమి, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.