Site icon Prime9

FIFA World Cup-2022: ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ షురూ.. ఖతార్, ఈక్వెడార్ల మధ్య మ్యాచ్

FIFA world cup 2022 tourney will start from today onwards

FIFA world cup 2022 tourney will start from today onwards

FIFA World Cup-2022: నేటి నుంచి ఖతార్‌ వేదికగా ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ప్రారంభంకానుంది. ఈ మెగాటోర్నీ నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరుగనుంది. ఈ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో మెుత్తంగా 32 జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్ లో అతిథ్య జట్టు ఖతార్‌ ( Qatar)ఈక్వెడార్‌ను ఢీకొనబోతోంది. అల్‌ బేట్‌ స్టేడియంలో ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 9గంటల30 నిమిషాలకు ప్రారంభంకానుంది. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు తొలిసారిగా ఖతార్ అతిథ్యమిస్తోంది. ఈ ప్రపంచకప్‌ మ్యాచ్ లను భారత్ లో స్పోర్ట్స్ 18 చానెల్, వూట్ యాప్ డిజిటల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈప్రపంచ కప్ కోసం ఖతార్ ఏకంగా 200 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. తొలిసారి ఈ వరల్డ్ కప్ టోర్నీలో మహిళా రిఫరీలు కనిపించనున్నారు.

ఫిఫా కప్ టోర్నీలో మెుత్తం టీమ్స్ అన్నింటినీ 8 గ్రూపులుగా విభజించారు. ఒక్కోదాంట్లో నాలుగు జట్లు ఉంటాయి. ప్రతి టీమ్ మిగతా మూడు జట్లుతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. మెుదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. ఈ ప్రపంచకప్‌లో ఢిఫెండింగ్ ఛాంపియన్ గా ఫ్రాన్స్ బరిలోకి దిగుతుంది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ప్రపంచకప్‌ 1930లో స్టార్ట్ అయింది. ఈ సాకర్ టోర్నీలో అందరి చూపు ముగ్గురి ఆటగాళ్లపైనే వారే రొనాల్డో, మెస్సీ, నెయ్‌మార్‌. వీరు తమ జట్ల తరుపున ఏ మేరకు రాణిస్తారో వేచిచూడాలి. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో బ్రెజిల్ ఐదు సార్లు గెలుచుకుంది. ఇటలీ, జర్మనీ చెరో నాలుగు సార్లు కప్ ను సాధించాయి.  ఇప్పటి వరకు 21 ప్రపంచకప్‌లు జరిగాయి.

గ్రూప్‌-ఎ: ఖతర్‌, ఈక్వెడార్‌, నెదర్లాండ్స్‌, సెనెగల్‌
గ్రూప్‌-బి: ఇంగ్లండ్‌, ఇరాన్‌, అమెరికా, స్కాట్లాండ్‌/వేల్స్‌/ఉక్రెయిన్‌
గ్రూప్‌-సి: అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పోలాండ్‌
గ్రూప్‌-డి: ఫ్రాన్స్‌, డెన్మార్క్‌, ట్యునిషియా, యూఏఈ/ఆస్ట్రేలియా/పెరూ
గ్రూప్‌-ఇ: స్పెయిన్‌, జర్మనీ, జపాన్‌, కోస్టారికా/న్యూజిలాండ్‌
గ్రూప్‌-ఎఫ్‌: బెల్జియం, కెనడా, మొరాకో, క్రొయేషియా
గ్రూప్‌-జి: బ్రెజిల్‌, సెర్బియా, స్విట్జర్లాండ్‌, కామెరూన్‌
గ్రూప్‌-హెచ్‌: పోర్చుగల్‌, ఘనా, ఉరుగ్వే, కొరియా

ఇదీ చదవండి: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియా సెలెక్షన్ కమిటీపై వేటు

Exit mobile version