Duplesis: ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారీ తీసింది. చివరి బంతికి లక్నో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ రికార్డ్ నమోదైంది. డూప్లెసిస్ కొట్టిన సిక్సర్ ఏకంగా 115 మీటర్ల దూరం వెళ్లింది.
The biggest six of IPL 2023 – Faf Du Plessis with a gigantic 115M six. pic.twitter.com/GdrYeEsWKt
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2023
ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారీ తీసింది. చివరి బంతికి లక్నో విజయం సాధించింది.
అయితే ఈ మ్యాచ్ లో ఓ రికార్డ్ నమోదైంది. డూప్లెసిస్ కొట్టిన సిక్సర్ ఏకంగా 115 మీటర్ల దూరం వెళ్లింది. ప్రస్తుతం దీనికి సబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇక ఈ మ్యాచ్ లో లక్నో పేసర్.. మార్క్ వుడ్ కళ్లుచెదిరే బౌలింగ్ వేశాడు. ఒకే ఓవర్లో.. 150 పైకి పైగా వేగంతో బంతులు వేశాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు మార్క్ 9 వికెట్లు తీసుకున్నాడు.
బెంగళూరు ఇన్నింగ్స్ 16వ ఓవర్లో మార్క్‌వుడ్ బంతులు 150 కిలోమీటర్ల వేగాంతో సంధించాడు.
153, 151, 150, 150, 151.7, 150కి.మిల వేగంతో వేసి ప్రత్యర్థి బ్యాట్లర్లను బెంబేలెత్తించాడు. ఇ
బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కొట్టిన సిక్స్ 115 మీటర్ల దూరం వెళ్లింది. ఈ షాట్ చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
రివి బిష్ణోయ్ బౌలింగ్ లో ఈ సిక్సర్ కొట్టాడు ఫాఫ్. ఈ సీజన్ లో ఇదే అత్యంత భారీ సిక్సర్. మెుదటి స్థానంలో అల్బీ మోర్కెల్ ఉన్నాడు.
ఆల్బీ 125 మీటర్లతో ముందుస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత పంజాబ్ ప్లేయర్ ప్రవీణ్ కుమార్ 124 మీటర్లు, 2011లో గిల్‌క్రిస్ట్ 122 మీటర్లు, 2010లో ఉతప్ప120 మీటర్లు, 2013 గేల్119 తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ లో లక్నో గెలిచింది. పూరన్ ఊచకోత బ్యాటింగ్ తో ఓటమి దిశగా సాగుతున్న లక్నో విజయం సాధించింది.