Site icon Prime9

MS Dhoni: ఐపీఎల్ కు ధోని రిటైర్మెంట్.. ఈ వ్యాఖ్యలు దానికి సంకేతమేనా?

ms dhoni

ms dhoni

MS Dhoni: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన చెన్నై భారీ స్కోర్ సాధించింది. రహానె 71 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అయితే కోల్ కతా లో జరిగిన మ్యాచుకు కూడా.. ఎక్కువ మంది సీఎస్ కే కు భారీగా మద్దతు తెలిపారు. అయితే మ్యాచ్ అనంతరం ధోని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

అభిమానులకు ధన్యవాదాలు

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన చెన్నై భారీ స్కోర్ సాధించింది. రహానె 71 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అయితే కోల్ కతా లో జరిగిన మ్యాచుకు కూడా.. ఎక్కువ మంది సీఎస్ కే కు భారీగా మద్దతు తెలిపారు. అయితే మ్యాచ్ అనంతరం ధోని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోని.. అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ సందర్భంగా సరదా వ్యాఖ్యలు చేశాడు. తనకు ఫేర్‌వెల్‌ ఇచ్చేందుకు వీరంతా సీఎస్‌కే జెర్సీ వేసుకున్నారన్నాడు. తర్వాత మ్యాచ్‌లో తప్పకుండా కోల్‌కతా జెర్సీలతోనే వస్తారని తెలిపాడు. మా జట్టుకు మద్దతు తెలపడానికి వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు. ఈ మ్యాచ్‌ మాత్రం నాకు ఫేర్ వెల్ ఇచ్చేందుకు వచ్చినట్లు అర్ధం అవుతుందని తెలిపాడు. ఈ మేరకు అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు.

కోల్‌కతాలో చాలామంది పవర్‌హిట్టర్లు ఉన్నారు. అయినప్పటికి అద్భుతంగా బౌలింగ్ చేసినట్లు ధోని తెలిపాడు. ఆటగాళ్ల విషయంలో స్పష్టత ఉండాలని వివరించాడు. గాయంతో బాధపడేవారికి విశ్రాంతినిచ్చి.. యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని సూచించాడు. అజింక్య రహానెపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నాడు.

Exit mobile version