Site icon Prime9

Delhi Capitals: డగౌట్ లో పంత్ జెర్సీ.. ఢిల్లీ పై బీసీసీఐ సీరియస్

Delhi Capitals

Delhi Capitals

Delhi Capitals: గత ఏడాది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీంఇండియా వికెట్ కీపర్, ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెఫ్టెన్ రిషబ్ పంత్ కోలుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐపీఎల్ సీజన్ 16 లో ఢిల్లీకి తాత్కాలిక కెఫ్టెన్ గా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ బాధ్యతలు చేపట్టాడు. అయితే హౌం గ్రౌండ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లు జరిగేటపుడు.. రిషబ్ పంత్ ను తీసుకొస్తామని ఆ జట్టు యాజమాన్యం తెలిపింది. ఈక్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ తో తొలి మ్యాచ్ సందర్భంగా పంత్ జెర్సీ నెంబర్ 17 ను డగౌట్ కు తగలించింది. అయితే ఈ ఘటనపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి లో ఉన్నట్టు తెలుస్తోంది.

మళ్లీ పునరావృతం కావద్దు(Delhi Capitals)

‘పంత్ జెర్సీ ని డగౌట్ లో తగిలించడం చాలా తీవ్ర మైన చర్య. ఇలాంటి పనులు ఒక మనిషి చనిపోయినపుడు లేదా రిటైర్మెంట్ సందర్భంగా చేస్తారు. కానీ పంత్ ప్రస్తుతం చాలా ఆరోగ్యకరంగా ఉన్నాడు. వేగంగా కోలుకుంటున్నాడు. త్వరలోనే మైదానంలోకి అడుగుపెడతాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఉద్దేశం మంచిదే గానీ.. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం చేయవద్దు’అని బీసీసీఐ ప్రతినిధి స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.

జీటీ మ్యాచ్ కు పంత్?

కాగా, పంత్ తమతోనే ఉన్నాడని చెప్పేలా.. టీం మెంబర్స్ లో ఉత్సాహం నింపేందుకు తొలి మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ .. పంత్ జెర్సీని డగౌట్ లో వేలాడదీశారు. ఈ నిర్ణయం జట్టు హెడ్ కోచ్ పాంటింగ్ దని తెలుస్తోంది. మరో వైపు మంగళవారం గుజరాత్ టైటాన్స తో ఢిల్లీ తలపడనుంది. ఈ మ్యాచ్ పంత్ కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది జట్టు యాజమాన్యం. అయితే పంత్ ను తీసుకురావాలంటే బీసీసీఐ అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే మ్యాచ్ ను వీక్షించేందుకు పంత్ రావడంపై ఇంకా స్పష్టత లేదు.
గత డిసెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పంత్‌ తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకున్నాడు. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నాడు. ఈ కారణంగా అతడు ఈ ఏడాది పలు మేజర్ సిరీస్‌లతో పాటు ఐపీఎల్‌కూ దూరమయ్యాడు

 

Exit mobile version