PBKS vs DC: ప్లే ఆఫ్స్ ముంగిట.. పంజాబ్ కు దిల్లీ షాక్ ఇచ్చింది. పంజాబ్ కు కీలకమైన మ్యాచ్ లో ఓడించి.. ప్లే ఆఫ్స్ ఆశలను గల్లంతు చేసింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన దిల్లీ.. పంజాబ్ ను కూడా ఇంటికి పంపింది. మెుదట రోసో విధ్వంసకర ఇన్నింగ్స్ తో దిల్లీ భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత ఛేదనలో పంజాబ్ తడబడింది.
కీలక మ్యాచ్.. (PBKS vs DC)
ప్లే ఆఫ్స్ ముంగిట.. పంజాబ్ కు దిల్లీ షాక్ ఇచ్చింది. పంజాబ్ కు కీలకమైన మ్యాచ్ లో ఓడించి.. ప్లే ఆఫ్స్ ఆశలను గల్లంతు చేసింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన దిల్లీ.. పంజాబ్ ను కూడా ఇంటికి పంపింది. మెుదట రోసో విధ్వంసకర ఇన్నింగ్స్ తో దిల్లీ భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత ఛేదనలో పంజాబ్ తడబడింది.
ఇప్పటికే ఐపీఎల్-16 ప్లేఆఫ్స్ రేసు నుంచి దిల్లీ నిష్క్రమించింది. పోతూ పోతూ.. పంజాబ్ ను కూడా ఇంటిబాట పట్టించింది.
మెుదట బ్యాటింగ్ చేసిన దిల్లీ 200+ స్కోరు చేసి.. కీలక పోరులో పంజాబ్‌కు చెక్ పెట్టింది.
లివింగ్‌స్టన్ సంచలన ఇన్నింగ్స్‌తో పంజాబ్‌లో ఆశలు రేపినా.. విజయం దిల్లీనే వరించింది.
ఏడో ఓటమిని ఖాతాలో వేసుకున్న కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ఆ జట్టు ముందంజ వేయాలంటే చివరి మ్యాచ్‌లో ఘన విజయం సాధించడంతో పాటు.. మిగతా జట్ల ఫలితాలు కలిసిరావాలి.
రోసో విధ్వంసం..
ఐపీఎల్-16లో ప్లేఆఫ్స్‌కు దూరమైన దిల్లీ.. పంజాబ్ అవకాశాలను కూడా దెబ్బ తీసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన దిల్లీ మెుదట భారీ స్కోర్ చేసింది.
మొదట ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రిలీ రొసో (82 నాటౌట్; 37 బంతుల్లో 6×4, 6×6), వార్నర్ (46; 31 బంతుల్లో 5×4, 2×6), పృథ్వీ షా (54; 38 బంతుల్లో 7×4, 1×6)
మెరుపులతో దిల్లీ 2 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఛేదనలో లివింగ్‌స్టన్ (94; 48 బంతుల్లో 5×4, 9×6) గొప్పగా పోరాడినా.. పంజాబ్‌ను గెలిపించలేకపోయాడు.
నోకియా (2/36), ఇషాంత్ శర్మ (2/36), అక్షర్ పటేల్ (1/27) ఆ జట్టును దెబ్బ తీశారు. 13 మ్యాచ్‌ల్లో పంజాబ్‌కిది ఏడో ఓటమి. ఆ జట్టు మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది.
ఆశలు రేపిన అతడు..
ఛేదనలో పంజాబ్ తడబడింది. ఓ దశలో భారీ ఓటమి తప్పదేమో అనిపించింది. ఆ జట్టు 9 ఓవర్లకు పంజాబ్ 63 పరుగులే చేయగలిగింది.
11 ఓవర్లలో 151 పరుగులు కావాలి. ఈ స్థితిలో బ్యాటింగ్ కి వచ్చిన లివింగ్ స్టన్ పంజాబ్ లో ఆశలు రేపాడు. సిక్సర్ల మోత మోగించడంతో లక్ష్యం కరుగుతూ వచ్చింది.
కానీ మరో ఎండ్‌లో అథర్వ బంతులు వృథా చేసేశాడు. దీంతో లక్ష్యం కొండంత పెరిగిపోయింది. చివరి 5 ఓవర్లలో 86 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే ముకేశ్ వేసిన 18వ ఓవర్లో 21 పరుగులు రావడం.. సమీకరణం 2 ఓవర్లలో 38గా మారింది. కానీ నోకియా వేసిన 19వ ఓవర్లో 5 పరుగులే ఇచ్చి కరన్ (11)ను ఔట్ చేశాడు.
చివరి ఓవర్లో 33 పరుగలు అవసరం అయ్యాయి. ఆ ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో 6, 4, 6 బాదాడు.
నాలుగో బంతి నోబాల్ కావడంతో చివరి 3 బంతులకు మూడు సిక్సర్లు బాదితే పంజాబ్ గెలిచే పరిస్థితి వచ్చింది.
కానీ వరుసగా రెండు డాట్స్ వేసిన ఇషాంత్ చివరి బంతికి లివింగ్‌స్టన్‌ను ఔట్ చేసి పంజాబ్ కథ ముగించాడు.